Twitter MD: ట్విట్టర్ ఎండీ కేసు, పోలీసులు ఏం చెయ్యాలని అనుకుంటున్నారు: హైకోర్టు అసహనం !
బెంగళూరు/లక్నో: ట్విట్టర్ ఇండియా ఎండీకి ఉత్తరప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీ చెయ్యడంతో కర్ణాటక హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ కేసు విచారణను ఏం చెయ్యాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని, అక్కడి పోలీసులు తీరు మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోందని కర్ణాటక హైకోర్టు విచారం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసుల దగ్గర ట్విటర్ ఎండీకి వ్యతిరేకంగా పక్కా సాక్షాలు ఉన్నాయా ? అని కర్ణాటక హైకోర్టు ఉత్తరప్రదేశ్ పోలీసులను ప్రశ్నించింది.

వీడియో వైరల్
వృద్దుడి మీద దాడి చేసిన కేసుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ కావడంతో ఉత్తరప్రదేశ్ లోని గాజియాబాద్ జిల్లాలోని లోని బార్డర్ పోలీసులు ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరి మీద కేసు నమోదు చేశారు. వృద్దుడి మీద దాడి చేసిన వీడియో ట్విట్టర్ లో వైరల్ కావడంతో ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరికి ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇంతకు ముందే నోటీసులు జారీ చేశారు.

హైకోర్టును ఆశ్రయించిన ట్విట్టర్ ఎండి
బెంగళూరులో నివాసం ఉంటున్నన ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరి తన మీద నమోదు చేసిన కేసును రద్దు చెయ్యాలని మనవి చేస్తూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు వివరాలు తెలుసుకున్న కర్ణాటక హైకోర్టు ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరిని అరెస్టు చెయ్యకుండా స్టే ఇచ్చింది.

పోలీసుల అత్యుత్సాహం !
అరెస్టు కాకుండా హైకోర్టు స్టే ఇవ్వడంతో ట్విట్టర్ ఎండీ మనీష్ మహేశ్వరి కొంచెం ఊపిరిపీల్చుకున్నారు. ఇదే సమయంలో విచారణకు హాజరుకావాలని ఉత్తరప్రదేశ్ పోలీసులు మళ్లీ మనీష్ మహేశ్వరికి నోటీసులు ఇవ్వడంతో ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు విచారణకు పిలిచి అరెస్టు చేసే అవకాశం ఉందని మనీష్ మహేశ్వరి కర్ణాటక హైకోర్టుకు చెప్పారు.

ఏం చెయ్యాలనుకుంటున్నారు ?
కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జి. నరేంద్ర నేతృత్వంలోని బెంచ్ ట్విట్టర్ ఇండియా ఎండీ పిటిషన్ విచారణ చేసింది. ఉత్తరప్రదేశ్ పోలీసుల తీరు చూస్తుంటే ఈ కేసు విచారణ ఎక్కడికి దారితీస్తుందో ? అర్దం కావడంలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మనీష్ మహేశ్వరిని విచారణ చెయ్యాలంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చెయ్య వచ్చు కదా అని హైకోర్టు ప్రశ్నించింది. అయితే మనీష్ మహేశ్వరిని విచారణకు మాత్రమే పిలిచారని, ఆయన్ను అరెస్టు చెయ్యడానికి కాదని ఉత్తరప్రదేశ్ పోలీసుల న్యాయవాది హైకోర్టుకు చెప్పారు.
Recommended Video

మీ దగ్గర పక్కా సాక్షాలు ఉన్నాయా ?
ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరికి వ్యతిరేకంగా మీ దగ్గర బలమైన సాక్షాలు ఉన్నాయా ? అంటూ కర్ణాటక హైకోర్టు ఉత్తరప్రదేశ్ పోలీసులను ప్రశ్నించింది. ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరి మీద నమోదు అయిన కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రదర్శిస్తున్న తీరుపై కర్ణాటక హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications