వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Twitter : కేంద్రంపై యూఎస్ లో న్యాయపోరాటానికి ట్విట్టర్ రెడీ-ఐటీ నిబంధనలపై

|
Google Oneindia TeluguNews

భారత్ లో సోషల్ మీడియా సంస్ధల్ని కట్టడిచేసే లక్ష్యంతో కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలపై యూఎశ్ కు చెందిన సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ గుర్రుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా తమ నిబంధనల ప్రకారం అన్ని దేశాలు నడుస్తుంటే.. భారత్ లో మాత్రం తమపై ఆంక్షలు విధించడాన్ని జీర్ణించుకోలేకపోతోంది.దీంతో ఈ వ్యవహారాన్ని న్యాయపోరాటం ద్వారా పరిష్కరించుకోవాలనిచూస్తోంది. అదీ యూఎస్ లో కావడం విశేషం.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లోని కంటెంట్‌ను తీసివేయడానికి కొన్ని భారత ప్రభుత్వ ఆదేశాలను ట్విటర్ రద్దు చేయాలని కోరుతోంది. అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ యూఎస్ లో న్యాయసమీక్షను ట్విట్టర్ కోరినట్లు తెలుస్తోంది. కేంద్రంతో పెరుగుతున్న ఘర్షణలో భాగమే ఈ న్యాయ సమీక్షను పొందడానికి యూఎస్ కంపెనీ ప్రయత్నమని సమాచారం.

twitter to opt another legal battle against its conflict with indian government

స్వతంత్ర సిక్కు రాజ్యానికి మద్దతు ఇచ్చే ఖాతాలు, రైతుల నిరసనల గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశాయని ఆరోపించిన పోస్ట్‌లు , కోవిడ్ 19 మహమ్మారిని ప్రభుత్వం ఎదుర్కొన్న తీరుపై విమర్శించే ట్వీట్‌లతో సహా కంటెంట్‌పై చర్య తీసుకోవాలని గత ఏడాది భారతీయ అధికారులు ట్విట్టర్‌ని కోరారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ యూఎస్ లో న్యాయసమీక్ష కోరడంపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించలేదు.

ట్విట్టర్‌తో సహా పెద్ద సోషల్ మీడియా సంస్థలు తమ చట్టపరమైన స్థితి ఉన్నప్పటికీ, తొలగింపు అభ్యర్థనలను పాటించడం లేదని భారత ప్రభుత్వం గతంలో చెప్పింది.గత నెల చివర్లో, కొన్ని ఆదేశాలను పాటించకుంటే క్రిమినల్ చర్యలు ఉంటాయని ఐటీ మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌ను హెచ్చరించింది. దీంతో భారత్ లో కంటెంట్ హోస్ట్‌గా లభించే బాధ్యత మినహాయింపులను కోల్పోకుండా ఉండటానికి న్యాయసమీక్ష కోరినట్లు తెలుస్తోంది.

English summary
twitter may be ready to challenge indian govt's new it rules with us judicial review.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X