సోషల్ మీడియా ద్వారా రక్షణ: ముంబైలో 8 మహిళా అధికారుల నియామకం
ముంబై: ముంబై పోలీసులు 8 మంది మహిళ అధికారులను ఆయా పోలిస్ స్టేషన్‌లకు ఇంచార్జీలుగా నియమించారు. ఈ 8 మంది మహిళా అధికారులు సోషల్ మీడియాను ఫాలో అవుతారు. అంతేకాదు శాంతిభద్రతల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని చేరవేస్తారు.
మహిళ పోలీసు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తాము ప్రమాదంలో ఉన్నామని సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేస్తే వెంటనే వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తారు. అంతేకాదు అవసరమైన జాగ్రత్తలను కూడ సోషల్ మీడియా ద్వారా బాధితులకు చేరవేస్తారు.

దేశంలోనే ఈ తరహ పోలీసులను నియమించడం మహరాష్ట్రలోనే ప్రథమమని ఆ రాష్ట్ర పోలీసు శాఖ ప్రకటించింది. వినూత్న కార్యక్రమం ద్వారా మహరాష్ట్ర పోలీసు శాఖ రికార్డుల్లోకి ఎక్కింది.
ట్విట్టర్‌ను ఈ మహిళా అధికారులు ఫాలో అవుతారు. దీనితో పాటు ఇతర సోషల్ మీడియాను కూడ ఫాలో అవుతారు. నేరస్తులను పట్టుకొనేందుకు వీరంతా ఇతరపోలీసులకు సహకరిస్తారు. అంతేకాదు నేరస్థులను పట్టుకొనేందుకుగాను ఈ మహిళా అధికారులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు.
మహరాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తీసుకొన్న ఈ నిర్ణయాన్ని స్థానిక మహిళా సంఘాల నేతలు అభినందిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా పోలీసుల నిర్ణయాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications