సీఎం పళని, పన్నీర్ కు షాక్: దినకరన్ ను కలిసిన ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేల మద్దతు !
పుదుచ్చేరి రిసార్ట్ లోని ఐదు మంది ఎమ్మెల్యేలు జంప్ కావడంతో అయోమయంలో ఉన్న టీటీవీ దినకరన్ కు కొంత ఊరటలభించింది. ఇద్దరు అన్నాడీఎంకే ఎంపీలు మద్దతు ఇవ్వడంతో టీటీవీ దినకరన్ కొంత ఊపిరిపీల్చుకున్నారు.
చెన్నై: పుదుచ్చేరి రిసార్ట్ లోని ఐదు మంది ఎమ్మెల్యేలు జంప్ కావడంతో అయోమయంలో ఉన్న టీటీవీ దినకరన్ కు కొంత ఊరటలభించింది. ఇద్దరు అన్నాడీఎంకే ఎంపీలు మద్దతు ఇవ్వడంతో టీటీవీ దినకరన్ కొంత ఊపిరిపీల్చుకున్నారు.
సోమవారం అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎంపీలు ఉదయ్ కుమార్, సెంగోట్టవన్ చెన్నైలోని అడయార్ లోని టీటీవీ దినకరన్ ఇంటికి చేరుకుని చర్చలు జరిపారు. దాదాపు గంటకుపైగా టీటీవీ దినకరన్ తో చర్చలు జరపిన తరువాత ఎంపీలు ఉదయ్ కుమార్, సెంగోట్టవన్ మీడియాతో మాట్లాడారు.

టీటీవీ దినకరన్ మా ఇద్దరితో పాటు ఇప్పటి వరకు 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఎంపీలు ఉదయ్ కుమార్, సెంగోట్టవన్ మీడియాకు చెప్పారు. పుదుచ్చేరిలోని రిసార్ట్ నుంచి ఐదు మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు కదా ? అని మీడియా ప్రశ్నిస్తే అలాంటిది ఏమీ లేదని, దినకరన్ అనుమతితోనే వారు బయటకు వెళ్లారని ఎంపీలు వివరించారు.
దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేల నాయకుడు, శాసన సభ్యుడు తంగ తమిళ సెల్వన్ సోమవారం పుదుచ్చేరి రిసార్ట్ దగ్గర మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలు ఎవ్వరూ పారిపోలేదని అన్నారు. మేము అందరూ సీఎం ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా చెయ్యాలనే మాటమీదే ఉన్నామని, అంత వరకు రిసార్ట్ లోనే ఉంటామని తంగ తమిళ సెల్వన్ వివరించారు.












Click it and Unblock the Notifications