ఎన్కౌంటర్: మేజర్, జవాను మృతి, ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ ఉగ్రవాదులు మళ్లీ తెగబడ్డారు. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్మీ మేజర్ తోపాటు ఓ జవాను మృతి చెందారు. షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య గురువారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. అందులో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జైపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్న బలగాలపైకి ఉగ్రవాదులు తెగబడ్డారని, ఇంకా కాల్పులు జరుగుతున్నాయని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

కాగా, కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల దాడిని సైనికులు బలంగా తిప్పికొట్టారు. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు సోషియాన్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్మీ అధికారితో పాటు జవాను మృతిచెందారు. తాజా, ఘటనల నేపథ్యంలో సైన్యం మరింత అప్రమత్తమైంది. ఆయా ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications