కన్నడ హీరో నవీన్ హత్య కేసు: ఇద్దరి అరెస్టు

బెంగళూరు: కన్నడ నటుడు, నిర్మాత హాయ్ కృష్ణ చిత్రం హీరో నవీన్ హత్య కేసులో ఇద్దరు నిందితులను మైసూరు నగరంలోని విజయనగర పోలీసులు అరెస్టు చేశారు. నవీన్ హత్య కేసులో తప్పించుకున్న మిగిలిన నిందితుల కొసం పోలీసులు గాలిస్తున్నారు.

మైసూరు నరంలోని బెళవాడి ప్రాంతంలో నివాసం ఉంటున్న మణి (20), శంకర్ (21) అనే ఇద్దరిని అరెస్టు చేశామని శుక్రవారం పోలీసులు చెప్పారు. నవీన్ ని హత్య చేసిన తరువాత నిందితులు ఇద్దరు ఫాం హౌస్‌లో తలదాచుకున్నారని విజయనగర పోలీసులు తెలిపారు.

Two arrested in Kannada film producer and actor Naveen murder case

మైసూరు నగరంలోని బెళవాడి ప్రాంతంలోని మారమ్మ దేవాలయం దగ్గర కన్నడ హీరో నవీన్ నివాసం ఉంటున్నాడు. ఈనెల మార్చి 15వ తేది ఆదివారం రాత్రి మారమ్మ దేవి ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలలో నవీన్ పాల్గొన్నాడు. ఆదివారం అర్దరాత్రి దాటిన తరువాత నవీన్ ను సుమారు ఆరుగురు లాక్కొని వెళ్లి మారణాయుధాయులతో దారుణంగా నరికి వేశారు.

తీవ్రగాయాలు కావడంతో నవీన్ కు ఎక్కువ రక్తం పోయి అతను మరణించాడు. సోమవారం వేకువ జామున అటు వైపు వెలుతున్న వారు నవీన్ హత్యకు గురైన విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు తప్పించుకున్నారని పోలీసులు చెప్పారు. పాతకక్షల కారణంగా నవీన్ హత్యకు గురైనాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+