ప్రధానిగా మోదీకి ధీటైన ప్రత్యర్ధి, సీన్ ఛేంజ్ - ఆ ఇద్దరికీ చెక్..!!

త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది ప్రధాని మోదీ లక్ష్యం. ఇందు కోసం అన్ని అస్త్రశస్త్రాలను వినియోగిస్తున్నారు. ఎలాగైనా ఈ సారి మోదీని అధికారానికి దూరం చేయాలనేది ఇండియా కూటమి టార్గెట్. దీని కోసం ప్రధాని మోదీకి ధీటుగా బలమైన నేతను ప్రధాని అభ్యర్దిగా ఖరారు చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ప్రధాని రేసులో నిలుస్తున్న ఇద్దరు నేతలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ సిద్దమైంది.

దళిత ప్రధాని కార్డుతో: ప్రధాని మోదీని ఎదుర్కొనేందుకు ఇండియా కూటమి కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ప్రధానిగా ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు, కూటమి ఛైర్ పర్సన్ మల్లిఖార్జున ఖర్గేను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దళిత కార్డు ప్రయోగం ద్వారా పలు రాష్ట్రాల్లో ఓటింగ్ ను తమ వైపు మళ్లేలా చేయవచ్చనేది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది.

Two Birds, One Stone: How Kharges PM Candidacy Aligns the Stars for Mamata and Kejriwal

అదే సమయంలో ప్రధాని పదవి ఆశిస్తున్న మమతా బెనర్జీ, కేజ్రీవాల్ వ్యూహాలకు దళిత పీఎం స్లోగన్ తో చెక్ పెట్టాలనేది కూటమిలోని ఇతర నేతల ఆలోచనగా స్పష్టం అవుతోంది. రాహుల్ గాంధీ కాకుండా ఖర్గేను అభ్యర్దిగా ఖరారు చేయటం ద్వారా దళిత ఓటింగ్ తో పాటుగా ఇతర వర్గాల మద్దతు దక్కుతుందని అంచనా వేస్తున్నారు.

మోదీని అడ్డుకోవాలంటే: తొలి దళిత ప్రధాని నినాదంతో వెళ్లటం కాంగ్రెస్ కే కాకుండా కూటమిలోని ఆప్, టీఎంసీ పార్టీలకు కీలకం కానుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 16.6 శాతం ఎస్సీ శాతం ఓటింగ్ ఉంది. దళిత ప్రధాని నినాదంతో రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందని లెక్కలు కడుతున్నారు. 1970 నుంచి మెజార్టీ దళిత ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది. తాజా సర్వేల్లోనూ మెజార్టీ దళిత ఓటర్లు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది. మోదీ ప్రధాని అయిన తరువాత దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న పలు ఘటనలతో బీజేపీ పైన ఆ వర్గాల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నట్లు భావిస్తున్నారు.

Two Birds, One Stone: How Kharges PM Candidacy Aligns the Stars for Mamata and Kejriwal

దీంతో, మోదీని ఎదుర్కోవటానికి దళిత ప్రధాని కార్డు మేలు చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. మోదీ ఇప్పటి వరకు ఓబీసీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఖర్గేను ప్రధాని అభ్యర్దిగా ప్రకటిస్తే పేదలతో పాటుగా ఇతర వర్గాల మద్దతు కూడగట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఇండియా కూటమి కొత్త వ్యూహాలు: కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే నియామకం తరువాత కర్ణాటకలో పార్టీ అధికారంలోకి వచ్చింది. 63 శాతం దళిత ఓటర్లు పార్టీకి అండగా నిలిచారు. బీఎస్పీ వంటి పార్టీల మద్దతు కూడగట్టటంలోనూ ఈ నిర్ణయం మేలు చేస్తుందని భావిస్తున్నారు. ఖర్గే అభ్యర్దిత్వం ద్వారా మమతా, కేజ్రీవాల్ కు తమ రాష్ట్రాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. దళిత ఓటింగ్ ఆ పార్టీలకు అండగా నిలిచే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.

2014, 2019లో టీఎంసీకి దళిత ఓటింగ్ మద్దతు తగ్గింది. బెంగాల్ లోని సామాజిక సమీకరణాలు ఖర్గే అభ్యర్దిత్వంతో టీఎంసీకి అనుకూలంగా మారుతాయనే అంచనాలు ఉన్నాయి. 10 సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర - కేంద్ర మంత్రిగా సుదీర్ఘ కాలం పని చేసిన అనుభవం ఉన్న నేతగా ఖర్గేకు గుర్తింపు ఉంది. కూటమిలోని అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఖర్గేకు అదనపు బలం. దీంతో, దళిత ప్రధాని నినాదంతో ముందుకెళ్లటం ద్వారా మోదీ గెలుపును అడ్డుకోవచ్చనేది ఇండియా కూటమి అంచనా. దీని పైన అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+