దారుణం: 16 ఏళ్ల బాలికపై 9 నెలలుగా అత్యాచారం.. నిందితుల్లో ఇద్దరు పోలీసు అధికారులు!
తిరువనంతపురం: కేరళలో దారుణ అత్యాచార ఉదంతం వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల ఓ బాలికపై కొందరు వ్యక్తులు తొమ్మిది నెలలుగా అత్యాచారం జరుపుతున్నారు. నిందితుల్లో ఓ ఎస్సైతో పాటు మరో పోలీసు అధికారి కూడా ఉండటం సంచలనం సృష్టించింది.
కేరళలోని ఆలప్పుజా జిల్లాలోని మారారికులం గ్రామంలో ఈ దారుణం వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం నిందితులందరినీ అరెస్టు చేశారు.

Recommended Video

జిల్లాలోని మారారికులం గ్రామానికి చెందిన అదీరా (37) అనే మహిళ స్థానికంగా ఓ కుటుంబానికి చెందిన ఓ బాలిక(16)కు పని కల్పిస్తానని నమ్మించింది. ఆ బాలిక తండ్రి అంగవైకల్యంతో, తల్లి మానసిక వైకల్యంతో బాధపడుతున్నారు.
ఇదే ఆసరాగా తీసుకొని సదరు బాలికను స్కూల్ మాన్పించిన అదీరా, బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపింది. ఇలా ఆ బాలికను తొమ్మిది నెలల పాటు వివిధ ప్రాంతాలు తిప్పి వ్యభిచారం చేయించింది. దీంతో బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది.
ఇక ఆ బాలికను వదిలించుకోవాలని భావించిన అదిరా.. ఆమెను ఇంటి దగ్గర వదిలేయడానికి తీసుకొచ్చింది. బాలిక ఏడుస్తుండటం గమనించిన స్థానికులు.. విషయం ఆరా తీయగా అదీరా చేసిన మోసం, జరిగిన ఘోరం వెలుగులోకి వచ్చాయి.
దీంతో మారారికులం గ్రామస్థులు అదీరాను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాలికను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం అదీరా పెద్ద బాంబు పేల్చింది.
బాలికపై అత్యాచారం జరిపిన వారిలో మారారికులం పోలీసు స్టేషన్‌లో ఎస్ఐగా పని చేస్తున్న లైజీ(39)తో పాటు డ్రగ్స్ విభాగం అధికారి థామస్ (46), ప్రిన్స్ (32), జీను (33) అనే వ్యక్తులు ఉన్నట్లు అదీరా పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు ఈ నలుగురితో పాటు అదీరాను కూడా అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications