యూపీలో దారుణం .. ఇద్దరు మైనర్ బాలికలను చంపి ఫతేపూర్ చెరువులో పడేసిన దుండగులు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కూరగాయలు తీసుకురావడానికి మధ్యాహ్నం పొలానికి వెళ్లిన ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉత్తరప్రదేశ్ జిల్లాలోని , అసోధర్ ప్రాంతంలోని ఫతేపూర్ లో ఒక గ్రామం వద్ద చెరువులో విగత జీవులుగా తేలారు. ఇద్దరు మైనర్ లైన దళిత సోదరీమణులను గుర్తు తెలియని ఆగంతకులు హతమార్చి చెరువులో పడేసినట్లుగా భావిస్తున్నారు. చెరువులో బాలికల మృతదేహాలను గుర్తించిన పోలీసులు సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు.

బాలికల కళ్ళలో తీవ్ర గాయాలు .. కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు
బాలికలకు కళ్ళలో తీవ్ర గాయాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. చెరువు నుంచి బయటకు తీసిన మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
దళితుడైన దిలీప్ ధోబి కుమార్తెలు అయిన పన్నెండేళ్ల సుమి, ఎనిమిదేళ్ల కిరణ్ లు కూరగాయలు తీసుకురావడానికి మధ్యాహ్నం పొలానికి వెళ్లి తిరిగి రాలేదని, కంగారుపడిన తల్లిదండ్రులు వారి కోసం వెతికి చివరికి పోలీసులను ఆశ్రయించారని పేర్కొన్నారు. ఈ క్రమంలో బాలికలు మృతి చెందినట్లుగా గుర్తించిన పోలీసులు మృతదేహాలను చెరువు నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఎఎస్‌పి రాజేష్ కుమార్ తెలిపారు.

మృతదేహాలను పోస్ట్ మార్టం చేస్తే ఏం జరిగిందో తెలిసే అవకాశం
రెండు మృతదేహాలకు కళ్ళలో తీవ్ర గాయాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
బాలికలపై అత్యాచారం చేయడానికి విఫల ప్రయత్నం చేసిన తరువాత దుండగులు బాలికలను చంపారని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలికలను హతమార్చిన వారిని గుర్తించి కఠిన శిక్ష పడేలా చూడాలని వారు వేడుకుంటున్నారు. అయితే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపించామని, నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని పోలీసులు తెలిపారు.
Recommended Video

ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించి మిస్టరీ చేదించే పనిలో పోలీసులు
ఇద్దరు మైనర్ బాలికల మర్డర్ మిస్టరీని ఛేదించే పనిలో ఉన్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ద్వారా అన్ని ఆధారాలను సేకరిస్తున్నారు.
తల్లిదండ్రులకు శత్రువులు ఎవరైనా ఉన్నారా ? లేదా బాలికలపై అత్యాచారం చేసి హతమార్చారా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. తాజాగా పెరిగిపోతున్న పలు ఘటనలు ఇంట్లో నుండి బయటకు వెళ్ళిన వారు ఇంటికి తిరిగి వచ్చేదాకా టెన్షన్ పడాల్సిన పరిస్థితి కల్పిస్తున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో తల్లిదండ్రులు బయటకు పంపాలంటేనే ఆందోళనపడే పరిస్థితి వచ్చింది .
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications