Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జమ్మూకాశ్మీర్‌లో భారీ హిమపాతం: ఇద్దరు విదేశీయులు మృతి

జమ్మూకాశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రఖ్యాత స్కీ రిసార్ట్‌లోని గుల్‌మార్గ్‌లో పర్యాటకుల సమూహంపై భారీ హిమపాతం ఒక్కసారిగా వచ్చి పడటంతో.. ఇద్దరు విదేశీయులు(పోలిష్‌) మరణించారు.

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రఖ్యాత స్కీ రిసార్ట్‌లోని గుల్‌మార్గ్‌లో పర్యాటకుల సమూహంపై భారీ హిమపాతం ఒక్కసారిగా వచ్చి పడటంతో.. ఇద్దరు విదేశీయులు(పోలిష్‌) మరణించారు. మరో 21 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ మధ్యాహ్నం హిమపాతం కారణంగా అఫర్వాత్ శిఖరం ధ్వంసమైంది. ఇందుకు సంబంధించిన వీడయోలు వైరల్‌గా మారాయి.ఈ వీడియోలో సందర్శకులపై మంచు హిమపాతం ఒక్కసారిగా వారిమీద పడింది.

Two foreigners killed In Massive Avalanche Strikes Gulmarg,J&K; Rescue Operation Underway

హిమపాతం కారణంగా మరణించిన ఇద్దరు విదేశీయులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మరణించినవారు విదేశీయులు కావడంతో చట్ట ప్రకారం తదుపరి కార్యక్రమాలుంటాయన్నారు. మరో 19 మంది విదేశీ పర్యాటకులను కాపాడామని బారాముల్లా పోలీసులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

'బుధవారం ఉదయం 21 మంది విదేశీ పౌరులు, 2 స్థానిక గైడ్‌లతో కూడిన 3 బృందాలు స్కీయింగ్ కోసం అఫర్వాత్ గుల్మార్గ్‌కు వెళ్లాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు హపత్‌ఖుద్ కాంగ్డోరిలో భారీ హిమపాతం సంభవించింది, అక్కడ ఈ స్కీయింగ్ బృందాలు చిక్కుకున్నాయి' అని పోలీసులు వెల్లడించారు.

కాగా, గత కొద్ది రోజులుగా జమ్మూకాశ్మీర్‌లో మంచు తీవ్రంగా కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో విదేశీయు పర్యాటకులు ఎక్కువగా వస్తున్నారు. అయితే, ఒక్కసారిగా వచ్చే హిమపాతాలు విషాద ఘటనలను మిగుల్చుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+