ఇద్దరు అమ్మాయిలపై 20 మంది గ్యాంగ్ రేప్: 15 రోజులు నరకం
భోపాల్: ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఇద్దరు అమ్మాయిలను నిర్బంధించి గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో జరిగింది. రేవా ప్రాంతంలో ఈ ఘోరం జరిగిందని జిల్లా ఎస్పీ ఎంఎస్ సికార్ వార్ తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి - రేవా ప్రాంతానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు ఇంటి నుండి పారిపోయారు. ఇద్దరు అమ్మాయిలు బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక వ్యక్తి వారికి పరిచయం అయ్యాడు. అతను ఇద్దరికి మాయమాటలు చెప్పాడు.
ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి హోషాన్ బాద్ కు తీసుకు వెళ్లాడు. తరువాత అక్కడి నుండి బోపాల్, జబల్ పూర్ లలో ఇద్దరు అమ్మాయిలను నిర్బంధించారు. పరిచయం అయిన వ్యక్తితో పాటు అతని స్నేహితులు ఇద్దరు అమ్మాయిల మీద సామూహిక అత్యాచారం చేశారు.

అమ్మాయిలు తప్పించుకోకుండా వారు పలు జాగ్రతలు తీసుకున్నారు. బయటకు పిలుచుకుని వెళ్లే సమయంలో వారిద్దరు ఇతరులతో మాట్లాడకుండా చూశారు. కారులో పలు చోట్ల తిప్పారు. ఇద్దరు అమ్మాయిలను వివిధ ప్రాంతాలలో కారులో తిప్పుతూ వారి మీద పదేపదే అత్యాచారం చేసి నరకం చూపించారు.
చివరికి ఒక ఇంటిలో ఇద్దరిని నిర్బంధించారు. ఆ సమయంలో ఇంటికి తాళం వెయ్యడం మరిచిపోయారు. విషయం గుర్తించిన ఇద్దరు అమ్మాయిలు అక్కడి నుండి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు జిల్లా మొత్తం గాలించి దాడులు చేసి పలువురు అనుమానితులను పట్టుకుని బాధితులకు చూపించారు.
వారిలో ఒకరిని ఇద్దరు యువతులు గుర్తు పట్టారని జిల్లా ఎస్పీ సికార్ వార్ అన్నారు. 20 మందికి పైగా తమ మీద అత్యాచారం చేశారని ఇద్దరు అమ్మాయిలు ఫిర్యాదు చేశారని, ఇద్దరిని ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో అందరిని అరెస్టు చేస్తామని ఎస్పీ ఎంఎస్ సికార్ వార్ తెలిపారు.












Click it and Unblock the Notifications