"మమ్మల్ని రేప్ చేస్తుంటే చూస్తుండిపోయారు"

న్యూఢిల్లీ : తమపై ఐదుగురు దుండగులు సామూహికంగా అత్యాచారం చేస్తుంటే తమతో వచ్చిన మా బాయ్‌ఫ్రెండ్స్ మౌనంగా చూస్తుండిపోయారని ఢిల్లీలోని ఆమన్ విహార్ సామూహిక అత్యాచార బాధితురాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. వారు పెద్దగా కేకలు వేసి తమను కాపాడుతారని తాము భావించామని, కాని వారు ఓ మూలన కూర్చొని తమపై సాగుతున్న దురాగతాన్ని చూస్తుండిపోయారని బాధితులైన 17, 18 ఏళ్ల బాలికలు పోలీసుల ముందు వాంగ్మూలమిచ్చారు.

ఓ బాయ్‌ఫ్రెండ్ అయితే కనీసం తమపై జరిగిన దారుణ ఘటన గురించి పోలీసులకు సాక్ష్యం చెప్పేందుకు నిరాకరించాడని బాధితులు చెప్పారు. ఈ కేసులో నిందితులైన ఇద్దరు మైనర్ బాలురతోపాటు మనీష్ (19), శివం (19)లను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సంఘటన జరిగిన స్థలంలో గతంలో మూడు సంఘటనలు జరిగినా పోలీసులు కనీసం గస్తీ ఏర్పాట్లు చేయలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

దేశ రాజధాని నగరమైన ఢిల్లీ శివార్లలో ఇద్దరు బాలికలు తమ బాయ్‌ఫ్రెండ్స్‌తో కలిసి సాయంత్రం విహారానికి పార్కుకు వెళ్లారు. అక్కడ ఇద్దరు బాలికలు సామూహిక అత్యాచారానికి గురయ్యారు. అమన్ విహార్ మురికివాడకు చెందిన 17,18 ఏళ్ల ఇద్దరు బాలికలు తమ బాయ్‌ఫ్రెండ్స్‌తో కలిసి ప్రేమికులకు కేంద్రమైన ముండ్క మెట్రోస్టేషను సమీపంలోని ఎన్డీపీఎల్ మైదానానికి విహారానికి వెళ్లారు.

Two girls gangraped by 5 boys in Aman Vihar, 4 arrested

అంతలో ఐదుగురు దుండగులు వారిని చూసి బాయ్‌ఫ్రెండ్స్‌ను కొట్టి వారిని మూలన కూర్చోబెట్టి, వారిముందే ఇద్దరు బాలికలపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం జరిపారు. రేప్ చేశాక ఈ సంఘటన గురించి పోలీసులకు చెపితే చంపేస్తామని బెదిరించారు. అనంతరం రోడ్డుపై పోలీసు వాహనం కనిపిస్తే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు బాధిత బాలికలను వైద్య పరీక్షకు పంపించగా వారిపై సామూహిక అత్యాచారం జరిగిందని తేలింది. అత్యాచారం చేస్తుండగా తాము అడ్డుకుంటే దుండగులు తమను చంపేసే వారని బాధిత బాలికలు రోదిస్తూ చెప్పారు. బాధిత బాలికలు మెట్రోరైలు పనులు చేస్తున్న కూలీల కూతుళ్లని పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+