ఇద్దరు అమ్మాయిలతో, బన్నీ సినిమా కాదు, భయంకరమైన స్కెచ్, ఆంటీ, మాంత్రికుడు ?

లక్నో/ఉత్తరప్రదేశ్: కాలేజ్ లో చదువుకునే సమయంలో ఇద్దరు యువతులకు పరిచయం అయ్యింది. ఇద్దరు అమ్మాయిలు ప్రతిరోజు కలుసుకుంటుంటే ఎవ్వరికి అనుమానం రాలేదు. అయితే ఇద్దరు అమ్మాయిల వెనుక చాలా కథ నడిచిందని వెలుగు చూసింది. ఈ మ్యాటర్ అందరికి తెలిసిపోయింది. అమ్మాయిని అబ్బాయిగా మారుస్తానని ఓ మాంత్రికుడు ఎంట్రీ ఇచ్చాడు. ఇదే సందర్బంలో ఓ అమ్మాయి దారుణ హత్యకు గురైయ్యింది.

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఘేరీ జిల్లా షాజహాన్‌పూర్‌ లో పూనమ్ కుమారి అలియాస్ పూనమ్ (27) అనే యువతి నివాసం ఉంటున్నది. కాలేజీలో చదువుతున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన ప్రీతి (25) ఏళ్ల యువతితో పూనమ్ కు పరిచయం ఏర్పడింది. పూనమ్, ప్రీతి ప్రతిరోజ కలుసుకునే వాళ్లు. ఇద్దరు స్వలింగ సంపర్కులు కావడంతో ప్రతిరోజు ఇద్దరూ గంటలు గంటలు మాట్టాడుకోవడం, ఎవ్వరూ లేని ప్రాంతాలకు వెళ్లి ఏకాంతంగా గడపం మొదలుపెట్టారు.

 boyandgirl

పూనమ్ ఇంటికి ప్రీతి, ప్రీతి ఇంటికి పూనమ్ వెళ్లి బెడ్ రూమ్ లోపల లాక్ చేసుకుని గంటలు గంటలు ఏకాంతంగా గడపడం మొదలుపెట్టారు. ప్రీతి, పూనమ్ అ సంబంధం స్థానికులకు తెలిసిపోయింది. ఈ సందర్భంలో ఇద్దరి సంబంధం ఆ గ్రామస్థులకు వ్యాపించి పక్క ఊర్లలో కూడా టామ్ టామ్ అయ్యింది. ప్రీతి, పూనమ్ లకు వేరే అబ్బాయిలో వారి కుటుంబ సభ్యులు వివాహం చేయలేకపోయారు. అమ్మాయిలు ఇద్దరూ స్వలింగ సంపర్కులు అని రెండు కుటుంబాలు అవమానంతో బాధపడుతున్నాయి.

నువ్వు నాతో జీవితాంతం ఇలా ఉండాలంటే నువ్వు పురుషుడిగా మారితీరాలని ప్రీతి ఆమె గర్ల్ ఫ్రెండ్ పూనమ్ కు చెప్పింది. తరువాత మనం ఇద్దరు పెళ్లి చేసుకుందామని చర్చించుకున్నారు. దీంతో ఈ మ్యాటర్ తెలుసుకున్న ప్రీతి తల్లి ఊర్మిళ తన కూతురితో రొమాన్స్ చేస్తున్న పూనమ్ ను చంపేందుకు ప్లాన్ చేసింది. రామ్ నివాస్ అనే మాంత్రికుడిని కలిసిన ప్రీతి తల్లి ఊర్మిళ పెద్ద కుట్రకే తెర తీసింది.

 lovers
పూనమ్‌ను చంపితే రూ.1.50 లక్షలు ఇస్తానని మాంత్రికుడితో ప్రీతి తల్లి ఊర్మిళ డీల్ మాట్లాడి అడ్వాన్స్‌గా కొంత డబ్బు మాంత్రికుడు రామ్ విలాస్ చేతికి ఇచ్చింది. నిన్ను మగాడిగా మారుస్తానని పూనమ్ కు చెప్పిన మాంత్రికుడు రామ్ నివాస్‌ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తాను మగాడు అయ్యి తన ప్రియురాలు ప్రీతితో హ్యాపీగా ఉండాలని పూనమ్ అనుకుంది.

మగాడిగా మారిపోవడానికి పూనమ్ ఏప్రిల్ 18న ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత వారం రోజులు గడిచిపోవడం, పూనమ్ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమెకు చేతబడి చేసిఉంటారనే అనుమానం హౌస్‌మేట్స్‌కు వచ్చింది. పూనమ్ కనపడటం లేదని, ఇంటికి నుంచి బయటకు వెళ్లి తరువాత తిరిగిరాలేదని ఆమె సోదరుడు ఏప్రిల్ 26న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పూనమ్, ప్రీతి సెల్‌ఫోన్ కాల్స్ వివరాలను పరిశీలించారు.

deadbody

ఆ తర్వాత పూనమ్, ప్రీతి వేర్వేరుగా మాంత్రికుడు రామ్ నివాస్‌తో చాలాసేపు మాట్లాడారని పోలీసులు గుర్తించారు. అనంతరం మాంత్రికుడు రామ్ నివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పూనమ్‌ను మగాడిగా మారుస్తానని ఆమెను నమ్మించి తీసుకెళ్లి హత్య చేసి ఆమె మృతదేహాన్ని గోమతీ నది ఒడ్డున ఉన్న అటవీ ప్రాంతంలో పడేసినట్లు మాంత్రికుడు రామ్ విలాస్ హత్యా నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

పూనమ్ హత్యతో ప్రీతికి సంబంధం ఉందా అని ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. పూనమ్ హత్య కేసులో మాంత్రికుడు రామ్ విలాస్‌తో పాటు ప్రీతి, ఆమె తల్లి ఊర్మిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాలేజ్ స్నేహితురాలితో శారీరక సంబంధం పెట్టుకుని తరువాత మగాడిగా మారాలని ప్రయత్నించిన పూనమ్ దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+