బంధువుల ఇంటికెళుతున్న యువతిపై గ్యాంగ్‌రేప్: అరెస్ట్
థానే: తన బంధువుల ఇంటికి వెళుతున్న ఓ యువతి(21)పై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని వాడి ప్రాంతంలో మంగళవారం చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం కసర గ్రామానికి చెందిన బాధిత యువతి వాడిలోని తన అత్తగారింటికి బయల్దేరింది. దేవుల్ రైల్వే స్టేషన్‌కు వెళుతున్న ఆమెను ఇద్దరు వ్యక్తులు వచ్చి అడ్డుకున్నారు.

ఆ తర్వాత ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా, వారి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు తిరిగి ఇంటికి చేరుకుంది. జరిగిన విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది.
దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులు రమేష్ సాబ్లే(22), సచిన్ వాసవేలను తీవ్రంగా గాలించి అరెస్ట్ చేశారు. ఇది ఇలా ఉండగా మరో ఘటనలో ఉస్గాన్ గ్రామంలో మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications