బాహాబాహికి దిగిన కాంగ్రెస్, బీజేపీ
బెంగళూరు: ఇన్నిరోజుల పాటు అసెంబ్లీకి మాత్రమే పరిమితమైన కర్ణాటక రాజకీయ సంక్షోభం మంగళవారం రోడ్డున పడింది. కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ నాయకులు, కార్యకర్తలు బాహాబాహికి దిగారు. పరస్పరం తిట్టుకున్నారు. కొట్టుకున్నారు. ఫలితంగా- ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులను అదుపులోకి తీసుకుని రావడానికి పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రెండు పార్టీల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమికి గుడ్‌బై చెప్పిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్ శంకర్, నగేష్ బెంగళూరు రేస్‌కోర్స్ రోడ్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న సమాచారం తెలియగానే కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే బయటికి రావాలంటూ కేకలు వేశారు. కాంగ్రెస్ నాయకుడు ఇవాన్ డిసౌజా దీనికి సారథ్యం వహించారు. అపార్ట్‌మెంట్ గేట్లు ఎక్కి, లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అప్పటికే అక్కడ మోహరించి ఉన్న పోలీసులు వారిని నివారించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య పెద్ద ఎత్తున వాగ్వివాదం చెలరేగింది. గేటు ఎక్కి లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మిగిలిన వారు పోలీసులను అడ్డుకున్నారు. ఈ సమాచారం తెలియడంతో భారతీయ జనతాపార్టీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో రేస్‌కోర్స్ రోడ్‌కు చేరుకున్నారు. దీనితో కాంగ్రెస్-బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఒకరినొకరు తోసుకున్నారు. తిట్టుకున్నారు. కొట్టుకున్నారు. ఫలితంగా సంఘటనాస్థలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అదనపు బలగాలను రప్పించారు. రెండు పార్టీల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
#WATCH Karnataka: Congress workers protest outside an apartment on Race Course road in Bengaluru alleging that independent MLAs have been lodged here. pic.twitter.com/sNyTnr6bZR
— ANI (@ANI) July 23, 2019












Click it and Unblock the Notifications