వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: అదృష్టం వస్తుందని తల్లిని బలిచ్చారు, చెల్లిని..

|
Google Oneindia TeluguNews

నాసిక్: మూఢ నమ్మకాల ప్రభావంతో కన్నతల్లినే బలిచ్చారు ఓ ఇద్దరు మూర్ఖులైన కుమారులు. తల్లిని బలిస్తే మంచి జరుగుతుందని ఓ మంత్రగత్తె చెప్పడంతో ఆమె ఎదుట తల్లిని, చెల్లిని, అత్తను బలి ఇవ్వడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. కాగా, ఈ ఘటనలో తల్లి, అత్త మరణించగా, చెల్లెలు తప్పించుకుపోయింది.

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వర్ జిల్లాలోని టేక్ హార్ష్ గిరిజన గ్రామంలో గత దీపావళి సమయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ దుశ్యర్యకు పాల్పడిన అన్నదమ్ములిద్దరితోపాటు 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Two kill mother, aunt in human sacrifice; 10 accused held

పోలీసుల కథనం ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో థానే జిల్లాలోని మోకడా గ్రామస్తులు కాశీనాథ్, గోవింద్ దోరేలు తన సోదరి రాహిబాయ్ పింగిల్ సూచన మేరకు టేక్ హార్ష్ గ్రామంలో ఉండే మంత్రగత్తె బచ్చిబాయ్ నారాయణ్ ఖడ్కేను సంప్రదించారు.

అదృష్టం కలిసిరావాలంటే తల్లిని, సోదరిని బలి ఇవ్వాలని వారికి మంత్రగత్తె సూచించడంతో వారు అందుకు అంగీకరించారు. దాంతో తల్లి బుదాబాయ్, సోదరి రాహిబాయ్‌లను మంత్రగత్తె వద్దకు తీసుకువెళ్లారు. మంత్రగత్తె విపరీతంగా కొట్టడంతో తల్లి అక్కడిక్కడే ప్రాణాలు వదిలింది. ఆ తర్వాత మృతురాలి కండ్లను పీకి సమీపంలో పూడ్చి పెట్టింది. ఆ సమయంలో చెల్లెలు అక్కడి నుంచి తప్పించుకుంది.

ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలను శ్రమజీవి స్వచ్ఛంద జిల్లా ఇంఛార్జ్ అయిన భగవాన్ మాధే దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆమెతో కలిసి భగవాన్ మాధే సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుపై మంత్రగత్తె తోపాటు మరో 10మందిని సోమవారం అరెస్ట్ చేశారు. ఇదే మాదిరిగా గతంలో కూడా ఓ మహిళను బలి ఇచ్చానని ఆమె పోలీసులకు తెలిపింది. నిందితులపై పలు సెక్షన్లతో కేసులు నమోదు చేశారు.

English summary
Two sons tortured and killed their mother and her sister on the orders of a female tantric in Take Harsh village of Igatpuri tehsil in the Nashik district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X