టార్గెట్ తాజ్‌మహల్?: ఆగ్రాలో జంట పేలుళ్లు, ఉగ్ర చర్యగా అనుమానం

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: తాజ్‌మహల్ లక్ష్యంగా పేలుళ్లకు పాల్పడతామని ఐఎస్ ఉగ్రాదులు ప్రకటించిన గంటల వ్యవధిలోనే శనివారం తెల్లవారుజామున ఆగ్రాలో జంట పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లు అగ్రా కాంటోన్మెంట్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకున్నాయి.

తొలుత స్టేషన్‌కు సమీపంలోని అశోక్‌ అనే వ్యక్తి ఇంటి పైకప్పుపై పేలుడు జరగగా, 45 నిమిషాల తర్వాత స్టేషన్‌లోని ఐదో నెంబర్‌ ప్లాట్‌ఫాం సమీపంలో చెత్తవేసే చోట మరో పేలుడు సంభవించింది.

Two low intensity blasts near Agra Cantt railway station

తక్కువ తీవ్రతతో పేలుళ్లు జరగడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేస్తున్నారు. ఫోరెన్సిక్‌ బృందం కూడా అక్కడికి చేరుకుని పరిశీలిస్తోంది.

కాగా, రైల్వే ట్రాక్ సమీపంలో ఓ బెదిరింపు లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుళ్లకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After an ISIS threat of attack on Taj in Agra, two low intensity explosions have been reported near Agra Cantt railway station today.
Please Wait while comments are loading...