ఇద్దరు అమ్మాయిలపై అత్యాచారం: ఇద్దరి అరెస్టు

నాగపూర్: రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు అమ్మాయిలపై అత్యాచారం జరిగింది. ఈ సంఘటనల్లో ఇరువురు యువకులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మొదటి సంఘటనలో తుషార్ మిస్కిన్ (24) అనే యువకుడు చాక్‌లేట్ ఇస్తానని బుజ్జగించి, తన వెంట తీసుకుని వెళ్లి ఎనిమిదేళ్ల అమ్మాయిపై అత్యాచారం చేశాడు.

ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లా పిప్లా గ్రామంలో చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యులు సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Two minor girls raped in Nagpur, 2 youths held

భండారా జిల్లాలోని పావోని గ్రామంలోని సమిత్ సతిబాబ్నే అనే 26 ఏళ్ల యువకుడు 17 ఏళ్ల బాలికపై 2013 సెప్టెంబర్, 2014 జనవరి మధ్య కాలంలో నాగపూర్ జిల్లాలోని డిఘోరి గ్రామంలో లైంగిక దాడులకు పాల్పడ్డాడు.

బాలిక గర్భవతి అయింది. అయితే, ఆమెను పెళ్లి చేసుకోవడానికి యువకుడు నిరాకరించాడుయ దీంతో సమిత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అతన్ని పోలీసులు సోమవారంనాడు అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+