దీపావళి స్వీట్లు ఇస్తాం: ఇద్దరు బాలికలపై రేప్
మీరట్: దిపావళి పండుగ సందర్బంగా స్వీట్లు తీసిస్తామని నమ్మించి ఇద్దరు చిన్నారులను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. మీటర్ జిల్లాలో జరిగిన ఈ దారుణ సంఘటనల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
పోలీసు అధికారుల కథనం మేరకు రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిన్నారుల మీద అత్యాచారం జరిగింది. బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలో మూడేళ్ల చిన్నారి నివాసం ఉంటున్నది. దీపావళి పండుగ సందర్బంగా బుధవారం సాయంత్రం స్నేహితులతో కలిసి ఇంటి ముందు ఆడుకుంటున్నది.
అదే సందర్బంలో రాహిష్ ( 25) అనే యువకుడు అక్కడికి వెళ్లాడు. పండగ సందర్బంగా స్వీట్లు తీసిస్తానని బాలికను నమ్మించి తీసుకు వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక సృహ కోల్పోవడంతో నిందితుడు అక్కడి నుంచి జారుకున్నాడు.

బాలిక కోసం గాలించిన కుటుంబ సభ్యులు చివరికి చిన్నారిని గుర్తించి ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని నిందితుడు రాహిష్ కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
పల్లవపురం ప్రాంతంలో ఏడేళ్ల బాలిక నివాసం ఉంటున్నది. బుధవారం సాయంత్రం బాలిక స్నేహితులతో కలిసి టపాకాయలు కాల్చుతున్నది. ఆ సందర్బంలో బైక్ లో అటువైపు వెళ్లిన విశాల్ ( 20) అనే యువకుడు బాలికను నమ్మించి తీసుకు వెళ్లాడు.
తరువాత నిర్జనప్రదేశంలోకి తీసుకు వెళ్లి బాలిక మీద అత్యాచారం చేశాడు. బాలికకు ఎక్కువ రక్తం పోవడంతో నిందితుడు అక్కడి నుంచి పరారైనాడు. బాలికను ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications