తల్లీసోదరులను బంధించి, అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్
గుర్గావ్: గుర్గావ్‌లో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లపై ఇంటి యజమాని సహా మరో ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. గుర్గావ్‌లోని బినోలాలో ఈ దారుణం చోటు చేసుకుంది.
13, 16 ఏళ్ల వయస్సు గల ఇద్దరు అక్కాచెల్లెళ్లు పని వెతుక్కోవడానికి నెల రోజుల క్రితం మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి తమ తల్లి, సోదరుడితో కలిసి గుర్గావ్ ప్రాంతానికి వచ్చారు. వాళ్లు బినోలాలో రామావతార్ (50) అనే వ్యక్తికి చెందిన ఇంటిని అద్దెకు తీసుకున్నారు.

శనివారం రాత్రి రామావతార్‌తో పాటు మరో ముగ్గురు చిత్తుగా మద్యం సేవించి ఇంటికి వచ్చారు. ముందుగా తల్లీసోదరులపై దాడి చేసి, వాళ్లను కొట్టి ఓ గదిలో బంధించారు. ఆ తర్వాత ఆడపిల్లలను ఇద్దరినీ గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకుని వెళ్లి అక్కడ ఒకరి తర్వాత ఒకరు పదే పదే అత్యాచారం చేశారు.
తాము ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి తన కూతుళ్లపై ఇంటి యజమాని కళ్లు పడ్డాయని తల్లి బోరున విలపిస్తోంది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితులకు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితులు రామావతార్, రామ్ కిషన్ (30), మంతోష్, ఓంబీర్ (22)లను పోలీసులు అరెస్టు చేశారు. ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి తెచ్చినందుకే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నిందితులు విచారణలో చెప్పారు.












Click it and Unblock the Notifications