బాలికపై 'వాట్సప్' ఫ్రెండ్ పలుమార్లు రేప్, బెదిరించి పక్కింటి వ్యక్తి...
న్యూఢిల్లీ: ఇద్దరు మైనర్ బాలికల పైన వేర్వేరు చోట్ల అత్యాచారం జరిగిందని దేశ రాజధాని న్యూఢిల్లీ పోలీసులు శనివారం చెప్పారు. మొదటి సంఘటనలో 12 ఏళ్ల బాలిక పైన 22 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను వాట్సప్ ద్వారా ఆమెకు పరిచయమైన వ్యక్తే కావడం గమనార్హం.
నిందితుడిని అరెస్టు చేశామని, అతని పైన పోస్కో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. పవన్ అనే వ్యక్తి బాధితురాలి కుటుంబ సభ్యులకు తెలుసు. అతను తరుచూ ఈస్ట్ ఢిల్లీలోని మాన్సరోవర్ పార్క్ ఏరియాలోని ఆ అమ్మాయి ఇంటికి వెళ్తుండేవాడు.

ఈ క్రమంలో పవన్, ఆ యువతి ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. వాట్సప్ ద్వారా వారి మధ్య స్నేహం పెరిగింది. ఆమె వయస్సు పన్నెండేళ్లే కావడంతో దానిని అతను అడ్వాంటేజ్‌గా తీసుకున్నాడు. పలు సందర్భాల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఇది తెలిసిన కుటుంబ సభ్యులు బాలికను హెచ్చరించారు. దీంతో ఆమె తాను పవన్‌తో పలుమార్లు శృంగారంలో పాల్గొన్నానని, తామిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ షిప్ ఉందని, తాము పెళ్లి చేసుకుంటామని చెప్పింది. దీంతో వారు ఆమెను పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అనంతరం తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మరో సంఘటనలో...
11 ఏళ్ల బాలిక పైన పక్కింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఈస్ట్ ఢిల్లీలోని నంద్ నగరి ప్రాంతంలో జరిగింది. బాలిక ఇంటి వద్ద ఒక్కతే ఉన్న సమయంలో అతను ఆమెను బెదిరించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications