దారుణం.. మతిస్థిమితం లేని బాలిక సహా ఇద్దరు మైనర్లపై అత్యాచారం

Karnataka Crime: కొంత మందు మనుషులు మృగాలకన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారిని చూస్తే.. మనుషుల మధ్య ఉండడం కన్నా అడవిలో ఉండడమే సేఫ్ అని అనిపిస్తోంది. చిన్నారుల నుంచి పండు ముసలి వరకు ఎవరిని కూడా కొందరు దుర్మార్గులు వదలడం లేదు. తాజాగా కర్ణాటకలోని రాయచూర్, హసన్ జిల్లాల్లో రెండు దారుణాలు చోటుచేసుకున్నాయి. రాయచూర్, హసన్ జిల్లాల్లో మతిస్థిమితం లేని బాలికతో సహా ఇద్దరు మైనర్లపై అత్యాచారం జరిగింది. ఈ మేరకు పోలీసులు వెల్లడించారు.

రెండో తరగతి విద్యార్థినిపై..
రాయచూర్ జిల్లాలోని మాన్వి తాలుకాలో రెండో తరగతి విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధిత విద్యార్థిని స్కూల్ బస్సులో పాఠశాలకు వెళ్లేది. అదే ప్రాంతానికి చెందిన నిందితుడు.. బాలికను స్కూల్ బస్సు నుంచి తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలిని మొదట మాన్వి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అనంతరం ఆ చిన్నారిని రాయచూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(RIMS)కు తరలించారు. తమ చిన్నారిని అపరిచితుడితో బయటకు పంపించినందుకు బాధితురాలి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరం జరిగిన రోజు విద్యార్థులను తీసుకెళ్లే సిబ్బందిని కూడా పోలీసులు ప్రశ్నించారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని రాయచూర్ ఎస్పీ పుట్టమాదయ్య పరిశీలించి.. దర్యాప్తును నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Two Minors Including Mentally Challenged Girl Assaulted in In Karnataka

మతిస్థిమితం లేని బాలికపై..
హసన్ జిల్లాలోని హలేబీడు పోలీస్ స్టేషన్ పరిధిలో మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఆమె కుటుంబ సభ్యులు ఆ సమయంలో బంధువుల ఇంట్లో జరిగిన కార్యక్రమానికి వెళ్లారు. ఎవరూ లేని సమయంలో బాధితురాలి పొరుగింట్లో ఉండే వ్యక్తి అదే అదనుగా భావించి ఇంట్లోకి ప్రవేశించాడు. నిందితుడు ఆ బాలికకు చాక్లెట్ ఇస్తానని చెప్పి ఇంట్లోకి ప్రవేశించిన ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ బాలిక తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఏడుస్తూ కనిపించింది. ఆమెను వారు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్పారు. ఈ పరిణామం గురించి తెలుసుకున్న నిందితుడు తన నివాసం వెనుక తలుపు నుంచి పారిపోయాడు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు నిందితుడి కోసం వేట ప్రారంభించారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+