జయపై పుకార్లు: బ్యాంకు ఉద్యోగితో సహ ఇద్దరి అరెస్టు

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై లేనిపోని పుకార్లు సృష్టించి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్న ఇద్దరిని చెన్నై నగర క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరిని విచారిస్తున్నామని గురువారం పోలీసులు చెప్పారు.

తుత్తకుడిలోని ప్రయివేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్న తిరుమణి సెల్వం (28), చెన్నై నగరంలోని ప్రయివేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న బాలసుందరం (48) అనే ఇద్దరు జయలలిత ఆరోగ్యంపై సోషల్ మీడియాలో పుకార్లు సృష్టించారు.

విషయం తెలుసుకున్న అన్నాడీఎంకే ఐటీ విభాగం ప్రధాన కార్యదర్శి రామచంద్రన్ చెన్నై క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు.

Two more arrested for Spreading false information on CM Jalalithaa’s health

పక్కా సమాచారం తెలుసుకుని గురువారం ఇద్దరిని అరెస్టు చేశారు. తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై ఈ విధంగా పుకార్లు పుకార్లు సృష్టించేవారికి గరిష్టంగా ఏడేళ్లు జైలు శిక్షపడే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని చెన్నై క్రైం బ్రాంచ్ పోలీసులు హెచ్చరించారు.

జయలలిత ఆరోగ్యంపై పుకార్లు పుకార్లు సృష్టించారని ఆరోపిస్తూ ఇప్పటికే 43 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని చెన్నై నగర పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+