వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Omicron దడ.. ఇవాళ మరో రెండు, 23కు చేరిన సంఖ్య.. ఎక్కడ అంటే

|
Google Oneindia TeluguNews

ఒమిక్రాన్ వేరియంట్ కరోనా దేశంలో దడ దడలాడిస్తోంది. నిన్న ఒక్కరోజే 16 కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ మరో రెండు కేసులు వచ్చాయి. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. తొలుత బెంగళూరులో వెలుగుచూసింది. ఇద్దరికీ ఒమిక్రాన్ అని తేలింది. తర్వాత ఢిల్లీలో ఒకరు, గుజరాత్ జామ్ నగర్‌లో ఒకరు, మహారాష్ట్రలో ఒకరికి చొప్పున కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కేసులు ఐదుకు చేరింది.

 ఒమిక్రాన్ దడ..

ఒమిక్రాన్ దడ..

నిన్న ఒమిక్రాన్ వేరియంట్ భయాందోళన కలిగించింది. మహారాష్ట్రలో 7, రాజస్తాన్‌లో 9 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 21కి చేరింది. ఇలా ఉండగా ఇవాళ మరో రెండు కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో మరో ఇద్దరికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ కరోనా సోకింది. దక్షిణాఫ్రికా నుంచి ముంబైకి తిరిగి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తి, అమెరికా నుంచి తిరిగి వచ్చిన 36 ఏళ్ల అతడి స్నేహితుడికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా సోమవారం నిర్ధారణ జరిగింది. ఎలాంటి లక్షణాలు లేని వారిద్దరూ సెవెన్‌ హిల్స్ ఆసుపత్రిలో అడ్మిట్‌ అయినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య పదికి చేరినట్లు పేర్కొంది. ఫస్ట్ ఒకటి.. నిన్న ఏడు వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ్టి రెండు కేసులతో ఆ సంఖ్య పదికి చేరింది.

23 కేసులు

23 కేసులు

దేశంలో ఒమిక్రాన్‌ మొత్తం కేసుల సంఖ్య 23కు చేరింది. ఆదివారం ఒక్కరోజే 17 కేసులు వచ్చాయి. 9 కేసులు రాజస్థాన్‌లో రాగా.. 7 కేసులు మహారాష్ట్రలోని పుణే జిల్లాలో వచ్చాయి. అంతకుముందు కర్ణాటకలో రెండు, గుజరాత్‌లో ఒకటి, ఢిల్లీలో ఒక కేసు బయటపడ్డాయి. సోమవారం ముంబైలో మరో ఇద్దరికి నిర్ధారణ కావడంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 23కి పెరిగింది. ఈ వేరియంట్‌ వ్యాప్తి నేపథ్యంలో కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పుపై ఆందోళన వ్యక్తం అవుతుంది.

Recommended Video

సీఎం కేసీఆర్ పై మండి పడ్డ ఉస్మానియా యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డులు!! || Oneindia Telugu
వేగంగా వ్యాప్తి

వేగంగా వ్యాప్తి

ఇటు ఒమిక్రాన్ డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తుంది. తీవ్ర ఒళ్ళు నొప్పులు, నీరసం, తలనొప్పి వంటి లక్షణాలు ఓమిక్రాన్ సోకిన వారికి ఉంటాయి. కానీ టిమ్స్ లో చేరిన అనుమానిత కేసుల్లో ఎవరికీ లక్షణాలు లేవు. టిమ్స్‌లో లండన్ నుంచి వచ్చిన యువతి చేరిందనే అనుమానం కలుగుతుంది. కానీ లండన్ నుంచి వచ్చిన యువతి తనకు అవమానం జరిగిందని వాపోయారు. దేశంలో వచ్చిన కేసులు టెన్షన్ పుట్టిస్తున్నాయి.

English summary
Maharashtra reported two cases of the Omicron variant of the coronavirus in Mumbai. now taken the state's count to 10 state’s health department said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X