పెరుగుతున్న ఓమిక్రాన్ కేసులు- గుజరాత్ లో మరో రెండు- మొత్తం 25కు చేరిక
దక్షిణాఫ్రిలో మొదలైన ఓమిక్రాన్ వైరస్ వ్యాప్తి ఇప్పుడు భారత్ లోనూ కనిపిస్తోంది. తాజాగా ఒకటి రెండు కేసులతో మొదలైన వ్యాప్తి కాస్తా చూస్తుండగానే ఇప్పుడు 25కు చేరిపోయింది. ఇవాళ గుజరాత్ లో మరో ఇద్దరు ఓమిక్రాన్ పాజిటివ్ గా తేలడంతో కలకలం రేగుతోంది. గతంలో డెల్టా వైరస్ ముప్పు పెరుగుతుందని భావించినా దీని కంటే ఓమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉంటుందని అంచనా వేస్తున్న తరుణంలో తాజా కేసులు ఆందోళన పెంచుతున్నాయి.

భారత్ లో ఓమిక్రాన్ ముప్పు
భారత్ లో ఓమిక్రాన్ వైరస్ ముప్పు క్రమంగా పెరుగుతోంది. దక్షిణాఫ్రికాతో పాటు ఇతర దేశాల నుంచి మన దేశంలోకి ప్రవేశించిన ప్రయాణికుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి జరిగినట్లు తెలుస్తోంది. బెంగళూరులో రెండు కేసులతో మొదలైన ఈ వైరస్ ముప్పు ఇప్పుడు ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ కు పాకింది. ఇంకా మరిన్ని రాష్ట్రాల్లోనూ ఈ వైరస్ వ్యాప్తి చెంది ఉండొచ్చన్న భయాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో చాలా రాష్ట్రాలు ఇప్పుడు అప్రమత్తమవుతున్నాయి. మళ్లీ ఆంక్షల బాట పడుతున్నాయి. త్వరలో కేసుల తీవ్రత పెరిగితే లాక్ డౌన్ పరిస్ధితులు కూడా తిరిగి తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.

25కు చేరిన కేసులు
ఇవాళ తాజాగా గుజరాత్ లో మరో రెండు ఓమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. డిసెంబర్ 4న కొత్త వేరియంట్‌తో దక్షిణాఫ్రికాకు తిరిగి వచ్చిన ఒకరు కోవిడ్‌కు పాజిటివ్ గా తేలిన తర్వాత గుజరాత్‌లో మరో ఇద్దరు వ్యక్తులు ఒమిక్రాన్ కోవిడ్ బారిన పడ్డారు. దీనితో, భారతదేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసులు 25కి చేరుకున్నాయి. గుజరాత్ లో ప్రస్తుతం మూడు కేసులు ఉన్నట్లు తేలింది. దీంతో వీరి నుంచి ఇంకా ఎవరికి వైరస్ వ్యాప్తించి ఉండొచ్చన్న కోణంలో పరిశీలన జరుగుతోంది. వీరి ప్రాధమిక కాంటాక్టులతో పాటు కుటుంబసభ్యుల్ని సైతం క్వారంటైన్ లోకి పంపుతున్నారు.

గుజరాత్ లో కేసులు ఇలా
డిసెంబరు 4న జింబాబ్వే నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు వెళ్లిన వ్యక్తికి ఓమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ సోకినట్లు తేలింది. అతని పరిచయాల్లో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఆ వ్యక్తికి కొత్తగా కనుగొన్న ఓమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ సోకినట్లు జీనోమ్ సీక్వెన్సింగ్ వెల్లడించింది. దక్షిణాఫ్రికాకు తిరిగి వచ్చిన వ్యక్తి పూర్తిగా టీకాలు వేయించుకున్నాడు. అతనితో పరిచయం ఉన్న కనీసం 10 మందిని క్వారంటైన్ చేసి పరీక్షించారు. కోవిడ్ -19 యొక్క ఓమిక్రాన్ వేరియంట్‌లో 23 కేసులు ఉన్నాయని, అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పార్లమెంటరీ స్ధాయీసంఘానికి తెలియజేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

బూస్టర్ డోస్ కోసం డిమాండ్
దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఓమిక్రాన్ ముప్పుతో వ్యాక్సిన్లపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అలాగే రెండు వ్యాక్సిన్ డోసులు తీసుకున్న వారికి సైతం ఓమిక్రాన్ వైరస్ సోకుతున్న ఉదాహరణలు ఇప్పుడు అందరిలోనూ భయాలు పెంచుతున్నాయి. దీంతో బూస్టర్ డోస్ పై కేంద్రం చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ను అధికారులు అవసరమైతే తీసుకోవచ్చని వైద్యవర్గాలు చెప్తున్నాయి. అయితే రెండవ డోస్ యొక్క తొమ్మిది నెలల తర్వాత మాత్రమే ఈ బూస్టర్ డోస్ లేదా మూడో డోస్ తీసుకవాలని ఆరోగ్య వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications