వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోల్‌కత్తాకు ఉగ్రవాదుల ముప్పు:నిఘా వర్గాలు(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కోల్‌కత్తా నగరం దాని తీరప్రాంతంలో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాలు హెచ్చిరించాయి. ఈ నేపథ్యంలో నేవీ అధికారులు తీరప్రాంతంలో ఉంచిన రెండు యుద్ద నౌకలను ఉపసంహరించుకున్నారు.

నౌకాదళ దినోత్సవాల్లో భాగంగా నవంబర్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రజల సందర్శనార్ధం ఐఎన్ఎన్ సుమిత్ర, ఐఎన్ఎస్ ఖుక్రీలను కోల్‌కత్తా రేవులో నిలిపి ఉంచాలని నౌకాదళం భావించినా.. తాజా హెచ్చరికల నేపథ్యంలో వాటిని మంగళవారం అక్కడ నుంచి తీసేసింది.

కోల్‌కత్తాకు ఉగ్రవాదుల ముప్పు: కేంద్ర నిఘా వర్గాలు

కోల్‌కత్తాకు ఉగ్రవాదుల ముప్పు: కేంద్ర నిఘా వర్గాలు


కోల్‌కత్తాలోని కిదిర్‌పుర్ డాక్ యార్డ్‌లో నేవీ వీక్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఐఎన్ఎస్ కుక్రీ యుద్ద నౌకపై చిన్నారులు.

కోల్‌కత్తాకు ఉగ్రవాదుల ముప్పు: కేంద్ర నిఘా వర్గాలు

కోల్‌కత్తాకు ఉగ్రవాదుల ముప్పు: కేంద్ర నిఘా వర్గాలు


కోల్‌కత్తాలోని కిదిర్‌పుర్ డాక్ యార్డ్‌లో నేవీ వీక్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఐఎన్ఎస్ సుమిత్ర యుద్దనౌకపై చిన్నారి టెలిస్కోప్ చూసేందుకు సహాయపడుతున్న నౌకదళ సిబ్బంది.

కోల్‌కత్తాకు ఉగ్రవాదుల ముప్పు: కేంద్ర నిఘా వర్గాలు

కోల్‌కత్తాకు ఉగ్రవాదుల ముప్పు: కేంద్ర నిఘా వర్గాలు


యుద్ద నౌకల తరలింపు సాధారణ చర్యల్లో భాగమేనని, అందుకు ఉగ్రవాద హెచ్చిరక కారణం కాదని రక్షణ శాఖ ప్రధాన పౌర సంబంధాల అధికారి గ్రూప్ కెప్టెన్ టీకే సింఘా స్పష్టం చేశారు.

కోల్‌కత్తాకు ఉగ్రవాదుల ముప్పు: కేంద్ర నిఘా వర్గాలు

కోల్‌కత్తాకు ఉగ్రవాదుల ముప్పు: కేంద్ర నిఘా వర్గాలు


యుద్ద నౌకల తరలింపు సాధారణ చర్యల్లో భాగమేనని, అందుకు ఉగ్రవాద హెచ్చిరక కారణం కాదని రక్షణ శాఖ ప్రధాన పౌర సంబంధాల అధికారి గ్రూప్ కెప్టెన్ టీకే సింఘా స్పష్టం చేశారు. ఉగ్రవాద కదలికలపై నిఘా పెంచేందుకు సదరు నౌకలను సముద్ర జలాల్లోకి పంపినట్లు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి.

యుద్ద నౌకల తరలింపు సాధారణ చర్యల్లో భాగమేనని, అందుకు ఉగ్రవాద హెచ్చిరక కారణం కాదని రక్షణ శాఖ ప్రధాన పౌర సంబంధాల అధికారి గ్రూప్ కెప్టెన్ టీకే సింఘా స్పష్టం చేశారు. ఉగ్రవాద కదలికలపై నిఘా పెంచేందుకు సదరు నౌకలను సముద్ర జలాల్లోకి పంపినట్లు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. యుద్ద నౌకల సన్నధ్దతను పరీక్షించడం కోసమే ఆ యుద్ధ నౌకల తరలింపు ప్రక్రియ చేపట్టామని మంగళవారం కోల్‌కత్తాలో రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశామని కోల్ కత్తా పోలీస్ కమిషనర్ సురోజిత్ కర్పురకాయస్థ చెప్పారు. పోలీసు బలగాలతో పాటు కోస్ట్ గార్డ్ కూడా తీరం వెంట నిఘాను పెంచినట్లు ఆయన చెప్పారు. కేంద్ర నిఘా వర్గాల హచ్చరికల నేపథ్యంలో కోల్ కతాలోనే కాక హాల్దియా, విశాఖ పోర్టుల్లోనూ భద్రత పెరిగింది.

English summary
Two Navy warships, which were scheduled to be berthed at Khidderpore dock here till November 7 for public visits, were today withdrawn to the sea for undisclosed 'operational reasons,' a Defence Ministry official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X