పఠాన్ కోట్ ఉగ్రదాడి: ఇద్దరు దేశ ద్రోహులు
న్యూఢిల్లీ: పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు దేశ ద్రోహులు ఉన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భారత భద్రతా దళాలు చేతిలో అంతం అయిన ఆరుగురిలో ఇద్దరు అంతర్గత శత్రువులు ఉన్నారని అధికారులు అంటున్నారు.
భద్రతా దళాలు అంతం చేసిన ఆరుగురు ఉగ్రవాదుల్లో ఇద్దరు భారతదేశానికి చెందినవారని ఉన్నారని, అయితే ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తరువాతే ఈ విషయంలో ఒక నిర్దారణకు రాగలుగుతామని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అంటున్నారు.
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. ఈ దాడిలో అంతర్గత శత్రువులు ఉన్నారని ఎన్ఐఏ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ అనుమానాలు బలపడటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

ఎస్పీ సల్వీందర్ సింగ్ సస్పెండ్
పంజాబ్ ఎస్పీ సల్వీందర్ సింగ్ ను సస్పెండ్ చేస్తూ పై అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

లైడిటెక్టర్ పరిక్షలు
సల్వీందర్ సింగ్ కు మంగళవారం లైడిటెక్టర్ పరీక్షలు (సత్యశోధన పరీక్షలు) నిర్వహించారు. బుధవారం మళ్లీ సల్వీందర్ సింగ్ కు లైడిటెక్టర్ పరిక్షలు నిర్వహించారు.

ఆరుగురిలో నలుగురు
భారత భద్రతా దళాలు అంతం చేసిన ఆరుగురు ఉగ్రవాదుల్లో నలుగురు పాక్ నుంచి వచ్చారని అధికారులు గుర్తించారు.

ఆ ఇద్దరు గురించి ఆరా
పఠాన్ కోట్ లో అంతం అయిన ఇద్దరు అంతర్గత శత్రువులు ఎవరనే విషయాన్ని అధికారులు ఆరా తీస్తున్నారు.

సల్వీందర్ సింగ్ కు ముందే తెలుసా?
పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద ఉగ్రవాదులు దాడులు చేస్తారని పంజాబ్ ఎస్పీ సల్వీందర్ సింగ్ కు ముందే తెలిసి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అందుకే కిడ్నాప్ డ్రామాలు
ఉగ్రవాదులకు సహాయం చెయ్యడానికి బయటకు వెళ్లిన సల్వీందర్ సింగ్ తనను, తన స్నేహితుడిని, వంట మనిషిని కిడ్నాప్ చేశారని నాటకాలు ఆడారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అంతర్గత శత్రువుల సహకారంతోనే
అంతర్గత శత్రువుల సహకారంతోనే పాక్ ఉగ్రవాదులు భారత్ లో చొరబడి పఠాన్ కోట్ పై దాడి చేశారని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగు చూసింది.

అధికారికంగా దృవీకరించాలి
పఠాన్ కోట్ ఉగ్రదాడిలో అంతర్గత శత్రువులు ఉన్నారని ఎన్ఐఏ అధికారులు అధికారికంగా దృవీకరించాలని పోలీసు వర్గాలు అంటున్నాయి.

ఎస్పీ కథ క్లోజ్
పంజాబ్ ఎస్పీ సల్వీందర్ సింగ్ కథ అయిపోయిందని, అతనికి ఉగ్రవాదులతో లింక్ ఉండటం వలనే లైడిటెక్టర్ పరిక్షలు నిర్వహిస్తున్నారని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications