ఎదురు కాల్పులు: 7 లాంచ్ ప్యాడ్ల ధ్వంసం, ఇద్దరు పాక్ జవాన్లు మృతి
శ్రీనగర్: పాకిస్థాన్ మరోసారి కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. తాజాగా గురువారం తెల్లవారుజామున 12.30 నుంచి 4.30 గంటల ప్రాంతంలో ఉత్తర కాశ్మీర్ కుప్వారా జిల్లాలోని సరిహద్దు నియంత్రణ రేఖ సమీపంలోని నౌగమ్ సెక్టర్ పైకి పాకిస్థాన్ కాల్పులకు తెగబడింది.
నౌగమ్ సెక్టార్‌లోని సెక్టార్‌లోని ధనిష్, లక్ష్మీ పోస్టులనే లక్ష్యంగా చేసుకుని పాక్ దళాలు కాల్పులు జరిపాయి. దీంతో వెంటనే స్పందించిన సైన్యం ఎదురు కాల్పులకు దిగింది. ఆరు గంటల పాటు ఇరువైపులా కాల్పులు హోరా హోరీగా సాగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు పాకిస్థాన్ జవాన్లు మరిణించారు.
ఈ దాడులు లైన్ ఆఫ్ కంట్రోల్‌కు రెండు కిలోమీటర్లు దూరంలో జరిగాయి. ఈ సర్జికల్ దాడుల్లో పాకిస్థాన్‌కు చెందిన ఐదు లాంచ్ ప్యాడ్లను భారత సైన్యం ధ్వంసం చేసింది. అయితే ఈ దాడిలో భారత సైన్యం వైపు నుంచి ఎలాంటి నష్టం సంభవించలేదు. ఈ కాల్పులపై భారత ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) రణబీర్ సింగ్ మాట్లాడారు.

గురువారం రాత్రి జరిపిన దాడుల్లో పాక్ భూభాగంలో ఉన్న 7 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామన్నారు. పీఓకేలోని పాకిస్థాన్ ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు మొదలయ్యాయని, ఇవి కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు వాళ్ల భూభాగంలో చోటు ఇవ్వొద్దని ఇన్నాళ్లుగా పదే పదే చెబుతున్నా వాళ్లు మాత్రం దాడులకు పాల్పడుతూనే ఉన్నారన్నారు.
భారత్‌పైకి పాక్ కవ్వింపు చర్యలను తాము ఉపేక్షించడం లేదని స్పష్టం చేశారు. ఈ కాల్పులు వెనుకు ప్రమేయం ఉన్నవారిపై చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు పాక్ వైపు నుంచి 20 చొరబాట్లను అడ్డుకున్నామని అన్నారు. గురువారం జరిగిన దాడులపై తమ అభ్యంతరాలన్నీ పాకిస్థాన్ జనరల్‌కు వివరించామని ఆయన తెలిపారు.
కాగా పీఓకేలో భారత సైన్యం దాడులు చేయడంపై దేశంలోని అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇది మంచి ఆపరేషన్ అని, భారత సైన్యం బాగా స్పందించిందని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ ఫాలీ హోమీ మేజర్ అన్నారు. ఈ దాడులపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రాం మాధవ్ కూడా ట్వీట్ చేశారు.
ప్రధాని మోడీ ఏం చెప్పారో అదే మన సైన్యం చేస్తోందని ఆయన ట్వీట్ చేశారు. దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను శిక్షించడం మొదలైందన్నారు. కాగా, భారత దాడులను ఖండిస్తున్నట్లు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చెప్పారు. పాక్‌ను రక్షించుకోవడం కోసం తాము సిద్ధంగా ఉన్నామని షరీఫ్ పేర్కొన్నట్లు పాక్ మీడియా వెల్లడించింది.
PM Modiji has walked the talk. Punishing the perpetrators of terror from across has begun
— Ram Madhav (@rammadhavbjp) September 29, 2016












Click it and Unblock the Notifications