Viral Video : ఢిల్లీ మెట్రోలో సీటు కోసం కొట్టుకున్న ప్రయాణికులు..!
ఢిల్లీ మెట్రో వ్యవహారం ఇటీవలే కాలంలో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. వింత ఘటనలు, వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. వాటిలో అసభ్యకర వీడియోలు, డ్యాన్స్ రీల్స్, పబ్లిక్‌లో ముద్దులు, గొడవలు ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరో ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఈసారి కారణం ఇద్దరి వ్యక్తుల మధ్య సీటు విషయంలో గొడవ జరగడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.
సీటు కోసం ఘర్షణ..
సాధారణంగా బస్సులు లేదా రైళ్లలో సీట్ల కోసం చిన్నపాటి వాగ్వాదాలు సర్వసాధారణం. కానీ ఈసారి ఢిల్లీ మెట్రోలో మాత్రం సీటు విషయంలో ఘర్షణ పరాకాష్టకు చేరింది. ఇద్దరు ప్రయాణికులు సీటు కోసం ఒకరితో ఒకరు గొడవ పడ్డారు. మొదట మాటలతో మొదలైన ఈ గొడవ.. కొద్దిసేపటికే పరిస్థితి అదుపు తప్పి, ఇద్దరూ ఒకరిపై ఒకరు చేయి చేసుకునే స్థితికి చేరుకుంది. రెజ్లర్ల తరహాలో పంచ్‌లు, తన్నులు విసురుతూ, ఒకరినొకరు నేలకేసి పడేయడం మొదలుపెట్టారు. ఈ దృశ్యం చూసి రైలులో ఉన్న ఇతర ప్రయాణికులు షాక్‌కి గురయ్యారు. కొందరు భయంతో పక్కకు తొలగిపోగా, ఇంకొందరు వారిని విడదీయడానికి ప్రయత్నించారు.

అయితే ఈ ఘర్షణతో రైలులో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చుట్టుపక్కల ఉన్న మహిళా ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కొందరు ప్రయాణికులు "దయచేసి ఆగండి, పిల్లలు ఉన్నారు!" అంటూ కేకలు వేయగా, మరికొందరు తమ ఫోన్లలో వీడియో తీయడం మొదలుపెట్టారు. కాగా సదరు వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే క్షణాల్లోనే వైరల్ అయింది. "ఇది రెజ్లింగ్ రింగ్ కాదు, మెట్రో రైలు!" అంటూ నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు. మరికొందరు "ఢిల్లీ మెట్రోలో ప్రయాణించడం ఇప్పుడు సురక్షితం కాదు" అంటూ విమర్శలు చేస్తున్నారు.
ఈ ఘటనపై ఢిల్లీ మెట్రో అధికారులు స్పందించారు. "ప్రజా రవాణా స్థలాల్లో ఇలాంటి ప్రవర్తన అసహ్యకరం. ప్రయాణికులు క్రమశిక్షణ పాటించాలి. దాడి చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం" అని వారు తెలిపారు. ఇప్పటికే ఢిల్లీ మెట్రోలో రీల్స్ షూటింగ్, అసభ్యకర ప్రవర్తన, గొడవలు ఎక్కువగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంఅయ్యింది. దాంతో వాటిని అరికట్టేందుకు మెట్రో సెక్యూరిటీ సిబ్బందిని పెంచి, సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణను కఠినతరం చేశారు.
Kalesh b/w Uncle and a guy inside delhi metro. pic.twitter.com/xt6NMKi5F1
— Ghar Ke Kalesh (@gharkekalesh) October 2, 2025
ఢిల్లీ వంటి ప్రధాన నగరంలో ప్రతిరోజూ లక్షల మంది ఉద్యోగులు, విద్యార్థులు, పర్యాటకులు మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా జరగడం భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. మహిళలు, వృద్ధులు, పిల్లల భద్రత కోసం మరింత గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ఈ వీడియో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications