బాలికపై అత్యాచారం: కామాంధులు అరెస్టు
థానే: కాలకృత్యాలు తీర్చుకొవడానికి వెళ్లిన బాలిక మీద అత్యాచారం చేసిన ఇద్దరు కామాంధులను మహారాష్ట్రలోని థానే పోలీసులు అరెస్టు చేశారు. అజ్మద్ (20), ఫుర్షిద్ (24) అనే ఇద్దరు కామాంధులను అరెస్టు చేశాని పోలీసులు తెలిపారు.
థానేలోని కళ్యాణ్ డివిజన్ ప్రాంతాలోని డోంబివలిలో ఓ భవనం నిర్మాణంలో ఉంది. అక్కడే అజ్మద్, ఫుర్షిద్ భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న భవనం పక్కన 14 సంవత్సరాల బాలిక తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నది.

బుధవారం రాత్రి బాలిక కాలకృత్యాలు తీర్చుకొవడానికి ఇంటి నుండి బయటకు వెళ్లింది. విషయం గుర్తించిన ఇద్దరు కామాంధులు బాలికను నిర్మాణంలో ఉన్న భవనంలోకి తీసుకు వెళ్లి అత్యాచారం చేశారు. బాలిక ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది.
బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక ఇద్దరు కామాంధులను గుర్తు పట్టడంతో అరెస్టు చేశామని పోలీసు అధికారి నీలేష్ పాటిల్ తెలిపారు. బాలికను అరెస్టు చేసిన ఇద్దరిని వైద్య పరీక్షలకు తరలించామని కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications