వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: మంత్రి ఇంటికెళ్లి చెంప ఛెళ్లుమనిపించిన మరో మంత్రి!

|
Google Oneindia TeluguNews

Recommended Video

టీచర్ల బదిలీల వివాదం.. మంత్రిపై చేయిచేసుకున్న మరో అమాత్యుడు!

జైపూర్: అసెంబ్లీ సమావేశాల్లో గొడవలు జరగడం సాధారణమే కానీ, ఏకంగా ఓ మంత్రి ఇంటికి వెళ్లిన మరో మంత్రి.. ఆయనపై చేయి చేసుకోవడం ఇప్పుడు రాజస్థాన్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇద్దరు ఒకరిపై ఒకరుదు దాడి చేసుకున్నారు. దీంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శిఖర్ జిల్లా ఖండేలా నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరగడం లేదనే ఆరోపణలు రావడంతో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బన్షీధర్ బజియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Two Rajasthan ministers battle it out for transfers

ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి వసుదేవ్‌ దేవ్నానీతో చర్చించేందుకు శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లారు బన్షీధర్ బజియా . ఈ క్రమంలో ఇద్దరు మంత్రుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురై బజియా.. మంత్రి దేవ్నానీపై చేయిచేసుకున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించింది.

ఈ ఘటన వివాదాస్పదంగా మారడంతో రాష్ట్ర బీజేపీ ఇంఛార్జ్‌ అవినాశ్‌ రాయ్‌ ఇద్దరు మంత్రులను పిలిపించి మాట్లాడినట్లు సమాచారం. కాగా, మంత్రి వసుదేవ్‌పై చేయి చేసుకున్నట్లు వస్తున్న వార్తలను బజియా తోసిపుచ్చారు. కావాలనే తనపై వదంతులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

అయితే, ప్రతిపక్షాలు ఈ వ్యవహారంపై విమర్శానాశ్రాలు సంధిస్తున్నాయి. బీజేపీ, ఆ పార్టీ మంత్రుల నిజస్వరూపం ఇదేనంటూ కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ విమర్శించారు. ఇది ఇలా ఉంటే, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర బదిలీ చేయాలంటూ కోరిన ఓ ఉపాధ్యాయురాలిని అరెస్ట్ చేయించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

English summary
It's a matter of huge embarrassment for Rajasthan Government when reports of heated arguments and scuffle between two ministers of Vasundhra Raje Government became viral in political corridors and on social media on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X