Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఛీఛీ..ఇదేం గలీజు పని: తరగతి గదిలో ఈ టీచర్లు ఏంచేశారో తెలుసా..?

విద్యార్థులకు చదువు చెప్పి వారిని ఒక దారిలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే దారి తప్పారు. సమాజంలో ఉన్నతమైన గౌరవాన్ని పొందుతున్న ఉపాధ్యాయ వృత్తికి మచ్చగా మారారు. తల్లిదండ్రుల తర్వాత గురువునే దైవంగా భావిస్తున్న మన దేశంలో... కొందరి అసభ్య ప్రవర్తన వల్ల తలదించుకోవాల్సి వస్తోంది. ఉపాధ్యాయులే ఇలా ఉంటే పిల్లలు ఎలా తయారవుతారు అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంతకీ ఇంతటి మచ్చ తీసుకువచ్చిన ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా... సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో.

గుజరాత్ రాష్ట్రం దహోద్ జిల్లాలోని బామన్ గ్రామంలో ఉండే ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు టీచర్లు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఏకంగా తరగతి గదిలోనే ముద్దుల పురాణానికి తెరలేపారు. ఒకరిని ఒకరు కౌగిలించుకుంటూ తెగ ఎంజాయ్ చేశారు. కానీ వారికి తెలియదు. ఓ మూడో కన్ను వారిని ఓ కంటకనబెడుతోందని. అదే వారిని అడ్డంగా బుక్ చేసింది. ఓ మొబైల్ ఫోన్‌లో వీరి బాగోతాన్ని రికార్డు చేసిన వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది.

Two teachers kissing in class room, video goes viral,enquiry ordered

వీడియో వైరల్‌ అవడంతో విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. అయితే ఆ ఇద్దరు టీచర్లు ఎవరనేది ఇప్పటి వరకు తెలియరాలేదని జిల్లా ప్రాథమిక విద్యాధికారి ఎన్జీ వ్యాస్ చెప్పారు. వీడియో వైరల్‌గా మారిన తర్వాత చాలా ఇబ్బందిగా మారడంతో గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఉపాధ్యాయులను క్షమించరాదని వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా కోరారు. ఇలాంటి వారివల్ల పిల్లలు పెడదోవ పడుతున్నారని వారు వాపోయారు.

గతనెలలో కూడా పూణేలోని ఓ పాఠశాలలో ఓ పీటీ మాస్టరు నలుగురు 9వ తరగతి అబ్బాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే పేరుతో జరుగుతున్న అవగాహన కార్యక్రమంలో భాగంగా వీరిపై లైంగిక దాడికి పాల్పడటంతో విద్యార్థులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. వెంటనే టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+