Encounter: జమ్ముకాశ్మీర్‍లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం..

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఉరీలోని నియంత్రణ రేఖకు సమీపంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. "బారాముల్లా జిల్లాలోని హత్‌లంగా, ఉరి ఫార్వర్డ్ ఏరియాలో ఉగ్రవాదులు, ఆర్మీ & బారాముల్లా పోలీసుల మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది" అని కాశ్మీర్ పోలీస్ జోన్ సోషల్ మీడియా పోస్ట్‌ పేర్కొంది. అనంతరం జరిగిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

అనంతనాగ్ జిల్లాలో కొండ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. ఉగ్రవాదులను ఏరివేసే ఆపరేషన్ శనివారం నాలుగో రోజుకు చేరుకోవడంతో ఉగ్రవాదుల ఆచూకీని గుర్తించేందుకు భద్రతా బలగాలు డ్రోన్లను ఉపయోగిస్తున్నాయి. నిర్దిష్ట ఇన్‌పుట్ ఆధారంగా ఆపరేషన్ ప్రారంభించామని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కశ్మీర్) విజయ్ కుమార్ తెలిపారు. మీడియాలో అసత్య ప్రచారం చెయ్యొద్దని రిటైర్డ్ పోలీసు, ఆర్మీ అధికారులకు ఆయన సూచించారు.

Two terrorists were killed in an encounter in Jammu and Kashmir

ఉగ్రవాదుల కాల్పుల్లో శుక్రవారం మరో సైనికుడు గాయాలతో మరణించడంతో వారి సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఆపరేషన్‌లో నాల్గవ సిబ్బంది మరణించినట్లు సైన్యం ఇంకా ధృవీకరించలేదు. 19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, అదే బెటాలియన్‌కు చెందిన మేజర్ ఆశిష్ ధోంచక్, డీఎస్పీ హుమాయున్ ముజామిల్ భట్ బుధవారం మరణించిన సంగతి తెలిసిందే.

బారాముల్లా జిల్లాలో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) టెర్రర్ మాడ్యూల్ ఇద్దరు మిలిటెంట్ సహచరులను అరెస్టు చేసి, వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న మరుసటి రోజే ఎన్ కౌంటర్ జరిగింది. వీరిద్దరినీ మీర్ సాహిబ్ బారాముల్లా నివాసి జైద్ హసన్ మల్లా, స్టేడియం కాలనీ బారాముల్లాకు చెందిన మహ్మద్ ఆరిఫ్ చన్నాగా పోలీసులు గుర్తించారు. "పాకిస్తాన్ ఆధారిత టెర్రర్ హ్యాండ్లర్ల ఆదేశంతో వారు సరిహద్దు దాటి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినందుకు అరెస్ట్ చేశామని" అని పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+