వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్రిపురలో బీజేపీకి షాక్.. ఎమ్మెల్యేలు రాజీనామాలు.. కాంగ్రెస్‌లో చేరిక

|
Google Oneindia TeluguNews

త్రిపురలో భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఇద్దరు ఎమ్మెల్యేలు కమలానికి గుడ్ బై చెప్పారు. బీజేపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు సుదీప్ రాయ్ బర్మన్, ఆశిష్ కుమార్ సాహా రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామాలను త్రిపుర శాషనసభ స్పీకర్ రతన్ చక్రవర్తికి సమర్పించారు. బీజేపీని వీడేందుకు ఇంకా చాలా మంది సిద్ధంగా ఉన్నారని బర్మన్ తెలిపారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిక
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని త్రిపుర ఎమ్మెల్యేలు సుదీప్ రాయ్ బర్మన్, ఆశిష్ కుమార్ సాహాలు ఆరోపించారు. అందుకే బీజేపీ పార్టీకి, తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఇద్దరు వెల్లడించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను కలిశారు. వారి సక్షమంలో కాంగ్రెస్ పార్టీలో చేశారు.

Two Tripura BJP MLAs resigned and join in congress

అసెంబ్లీలో 33కి తగ్గిన బీజేపీ బలం
త్రిపుర అసెంబ్లీలో మొత్తం 60 మంది సభ్యులు. 36 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ అధికారం చేపట్టింది. అయితే వారిలో ఒకరు ఇప్పటికే టీఎంసీలో చేరారు. అతనిపై వేటు కూడా పడింది. తాజా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో అసెంబ్లీలో బీజేపీ బలం 33కి తగ్గింది. కమలాన్ని వీడేందుకు చాలా మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని సుదీప్ రాయ్ బర్మన్ పేర్కొన్నారు. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో వారు మరి కొన్ని రోజుల పాటు వేచి చూస్తున్నారని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌తో పాటు త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చని బర్మాన్ అభిప్రాయపడ్డారు.

Recommended Video

Lok Sabha Election 2019 : త్రిపుర తూర్పు లోక్ సభ ఎన్నిక వాయిదా... ఎందుకంటే? || Oneindia Telugu

English summary
Shock to bjp in tripura, two bjp mlas resigned, bjp mlas joined in congress , BJP strength reduced to 33 in Tripura Assembly
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X