girlfriend: ఫస్ట్ భార్య వదిలేసింది, రెండో భార్య జంప్, మూడోసారి ఆంటీతో ?, చంపేసి శవంతో త్రీడేస్!
భర్త దెబ్బకు ఫస్ట్ భార్య వదిలేసింది, రెండో భార్య ప్రియుడితో కలిసి లేచిపోయింది. పెళ్లి అచ్చురాలేదని అనుకున్న వ్యక్తి ముచ్చటగా మూడో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో పారిపోయి సహజీవనం చేశారు. అక్కడే ఒకరు హత్యకు గురైనారు.
తిరువనంతపురం/కాసరగూడు: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కాపురం చేశాడు. దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి, దంపతులకు పిల్లలు పుట్టిన తరువాత గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయి. దెబ్బకు భర్తను వదిలేసిన భార్య పిల్లలతో కలిసి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య వెళ్లిపోవడంతో అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యతో కాపురం చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. భర్త దెబ్బకు అతని రెండో భార్య ప్రియుడితో కలిసి లేచిపోయింది.
పెళ్లి అచ్చురాలేదని అనుకున్న వ్యక్తి ముచ్చటగా మూడో మహిళను సెట్ చేసుకున్నాడు. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో కలిసి పారిపోయాడు. వేరే ప్రాంతంలో ఇద్దరూ సహజీవనం చెయ్యడం మొదలుపెట్టారు. అక్కడకూడా పంచాయితీ మొదలు కావడంతో ఒకరు హత్యకు గురైనారు. నాలుగు రోజుల పాటు శవం ఇంట్లోనే ఉండటం, విపరీతమైన దుర్వాసన రావడంతో హత్య జరిగిన వియం వెలుగులోకి వచ్చింది.

ఫస్ట్ భార్య వదిలేసింది
కేరళలోని వాయనాడ్‌కు చెందిన ఆంథోణఇ అనే వ్యక్తి ఓ రబ్బరు ఎస్టేట్‌లో పనిచేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆంథోణి ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న ఆంథోణి దంపతులకు భార్య, పిల్లలతో ఉన్నారు. ఆంథోణి దంపతులు వైధ్రి ప్రాంతంలో నివాసం ఉండేవారు. అయితే ఆంథోణికి, అతని భార్యకు తరచూ గొడవలు రావడంతో అతన్ని భార్య వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది.

రెండో పెళ్లి
మొదటి భార్య వదిలేసి పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోవడంతో కొంతకాలం పాటు ఆంథోణి ఒంటరిగా ఉంటున్నాడు. డబ్బులు సంపాధిస్తున్న ఆంథోణి ఒంటరిగా ఉండలేకపోయాడు. ఇదే సమయంలో పరిచయం అయిన మహిళను ఆంథోణి రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్న ఆంథోణికి, అతని రెండో భార్యల మధ్య గొడవలు మొదలైనాయి. కొంతకాలం పాటు గొడవపడుతూ వచ్చిన రెండో భార్య ఆమె భర్త ఆంథోణి మీద విరక్తి పెంచుకుంది.

ప్రియుడితో రెండో భార్య జంప్
దంపతుల మాత్రమే ఒంటరిగా ఉండటంతో వారికి పంచాయితీలు చెయ్యడానికి ఇరువైపుల కుటుంబ సభ్యులు అందుబాటులో లేరు. ఇదే సమయంలో భర్త ఆంథోణి తీరుతో విసిగిపోయిన అతని రెండో భార్య మంచి ప్రియుడిని సెట్ చేసుకుంది. భర్త ఆంథోణి రబ్బర్ తోటలో పని చెయ్యడానికి వెళ్లిన తరువాత అతని రెండో భార్య ఆమె ప్రియుడితో కలిసి జెండా ఎత్తేసింది.

ప్రియురాలిని సెట్ చేసుకున్నాడు
రెండో భార్య కూడా ఇష్టం లేక అత న్ని విడిచిపెట్టి వెళ్లిపోవడంతో ఆంథోణి ఒంటరివాడు అయ్యాడు. ఇదే సమయంలో ఓ మహిళతో ఆంథోణి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఆంథోణి అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ పేరు నీతూ. ఇక్కడే ఉంటే లేనిపోని సమస్యలు వస్తాయని అనుకున్న ఆంథోణి అతని ప్రియురాలు నీతూను తీసుకుని ఊరు విడిచి కేరళ- కర్ణాటక సరిహద్దులోని కాసర్‌గూడ్ ప్రాంతానికి వెళ్లిపోయాడు. కాసరగూడ్ లో ఇంటిని అద్దెకు తీసుకున్న ఆంథోణి అతని ప్రియురాలు నీతూతో కలిసి జీవించడం ప్రారంభించాడు.

రబ్బరు ఎస్టేట్‌లో పనిచేస్తూ?
ఆంథోణికి విపరీతమైన సెక్స్ కోరికలు ఉన్నాయని తెలిసింది, అయితే ఆంథోణి కోరికలు అన్నీ తీర్చడానికి నీతూ అభ్యంతరం వ్యక్తం చేసిందని తెలిసింది, ఇదే వియంలో ఆంథోణి, నీతాల మధ్య గొడవలకు దారి తీసింది. ఇద్దరి మధ్య వాగ్వాదాలు, గొడవలు మొదలైనాయి. రోజురోజుకూ ఇంట్లో సమస్యలు పెరిగిపోవడంతో నీతూ విసిగిపోయిందని తెలిసింది.

ఇంట్లోనే ప్రియురాలిని చంపేశాడు
ఇటీవల ఇంట్లో నీతూ, ఆంథోణిల మధ్య గొడవ జరగడంతో అది పెద్దది అయ్యింది. ఆ సమయంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆంథోణి అతనితో సహజీవనం చేస్తున్న ప్రియురాలు నీతూ మీద దాడికి పాల్పడ్డాడు. ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన ఆంథోణి నీతూను గొంతు నులిమేశాడు. గట్టిగా గొంతు నులమడంతో నీతూ మృతి చెందింది. గొంతు నులిమడంతో కళ్ల ముందే నీతూ కుప్పకూలి చనిపోవడాన్ని చూసిన ఆంథోణి ఆందోళనకు గురైనాడు.

ఏం చెయ్యాలో తెలీక?
నీతూను హత్య చేసినట్లు ఆంథోణి బయట ఎవరికీ చెప్పలేదు. నీతూ మృతదేహాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక ఆమె మృతదేహంతో 3 రోజుల పాటు అదే ఇంట్లోనే ఉండిపోయిన ఆంథోణి ఆందోళన చెందాడు. మూడు రోజుల తర్వాత ఆంథోణి ఇంట్లో నుంచి దుర్వాసన రావడం మొదలైయ్యింది. నీతూ మృతదేహం ఓ గదిలో వేసిన ఆంథోణి టెన్షన్ తో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు, నీతూ శవాన్ని మాయం చెయ్యాలని అనుకున్నా ఆంథోణికి కుదరలేదు. ఆ తరువాత ఆంథోణి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చి అతని ఇంట్లోకి పరిశీలించగా నీతూ శవమై కనిపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

రైల్వేస్టేషన్ లోకి వెళ్లి ఏం చేశాడంటే?
పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత ఆంథోణి ఎలాగైనా తప్పించుకుందామని రైల్వేస్టేషన్, బస్టాండ్ లకు వస్తాడని అనుకున్న పోలీసులు అతని మీద నిఘా పెట్టారు. అనుకున్నట్టుగానే ఆంథోణి ముంబాయికి పారిపోవడానికి తిరువనంతపురం రైల్వేస్టేషన్ కు వచ్చాడు. పోలీసులు ఆంథోణిని అదుపులోకి తీసుకున్నారు.
అక్రమ సంబంధం కారణంగా మహిళను హత్య చేసి యుంబాయి తప్పించుకోవాలని ప్రయత్నించిన ఆంథోణిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం మీద మూడో పెళ్లి చేసుకోవాలని అనుకుని అంతుకు ముందే అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను ఆమె ప్రియుడు హత్య చెయ్యడం కాసరగూడ్ లో కలకలం రేపింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications