ఢిల్లీ రేప్ కేసు: వెలుగులోకి క్యాబ్ డ్రైవర్ దురాగతాలు, ఉబెర్ క్యాబ్ సర్వీసులపైనా నిషేధం

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఉబెర్ క్యాబ్ సర్వీసులను ప్రభుత్వం నిషేధించింది. ఈ క్యాబ్ సర్వీసులకు చెందిన డ్రైవర్ శివ కుమార్ తన క్యాబ్‌లో ప్రయాణించిన 27 మహిలపై అత్యాచారం చేసిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

దేశ రాజధానిలో శుక్రవారం రాత్రి అత్యాచారానికి గురైన యువతి కేసులో అరెస్టైన క్యాబ్ డ్రైవర్ శివకుమార్ దురాగతాలు పోలీసులు విచారణలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2011లో దక్షిణ ఢిల్లీలో జరిగిన ఓ రేప్ కేసులో శివకుమార్ ఏడు నెలలు పాటు జైలులో గడిపినట్లు పోలీసులు వెల్లడించారు.

దేశ రాజధాని న్యూఢిల్లీకి 160 కిలోమీటర్ల సమీపంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని మధురలో అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు తదుపరి విచారణ కోసం శివకుమార్‌ను సోమవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఫోన్ నెంబర్ ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

శివకుమార్ అత్యాచారానికి పాల్పడ్డ కారుని కూడా ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉబెర్ క్యాబ్ సర్వీసు సంస్ధ క్యాబ్ ల్లో భద్రతా నిబంధనలు పాటిస్తుందా లేదా అని తెలుుసుకునేందుకు 'ఉబెర్' క్యాబ్ సర్వీసుకు పోలీసులు నోటీసులు పంపించారు.

Uber cab driver a repeat offender, was arrested in a rape case in 2011: Delhi police

శుక్రవారం రాత్రి ఢిల్లీలో 27ఏళ్ల మహిళ క్యాబ్‌లో ఇంటికి వెళ్తుండగా డ్రైవర్ మార్గమధ్యంలో అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్‌ నుంచి ఉత్తర ఢిల్లీలోని ఇందర్‌లోక్‌లో గల తన ఇంటికి తిరిగి వెళ్తుండగా రాత్రి జరిగింది. గుర్గావ్‌కు చెందిన గ్లోబల్ టాక్స్ అండ్ అడ్వయిజరీ సర్వీస్ కన్సల్టెంట్స్‌లో పనిచేస్తోంది.

మొబైల్ ఆప్ ద్వారా ఆమె ఇంటికి తిరిగి వెళ్లడానికి స్విఫ్ట్ డిజైర్‌ను బుక్ చేసుకుంది. ఆ స్విఫ్ట్ కారులోనే దారుణం చోటు చేసుకుంది. తనపై ఎక్కడ అత్యాచారం జరిగిందీ ఆమె గుర్తించే స్థితిలో లేదు. మిత్రులతో డ్రింక్స్ తాగడం వల్ల, తనపై దాడి జరిగిన దిగ్భ్రమ నుంచి తేరుకోనందు వల్ల ఆమె స్థలాన్ని గుర్తించలేకపోతున్నట్లు చెబుతున్నారు.

కారులో కూర్చుని వెనక్కి ఒరిగి కూర్చుంది. నిద్రమత్తులో కూడా ఉంది. ఈ స్థితిలో కారును నిర్మానుష్యమైన ప్రదేశంలో డ్రైవర్ ఆపాడు. అది గమనించి దిగడానికి ప్రయత్నించింది. అయితే, డోర్స్ లాక్ చేసి ఉన్నాయి. ఆమె కేకలు వేసింది. కానీ డ్రైవర్ ఆమెను వెనక్కి తోసి అత్యాచారం జరిపాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+