ఎన్ఐఎన్ కస్టడీకి నవీద్: మీడియా వద్ద నవ్వేశాడు

జమ్మూ: బీఎస్ఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని దాడి జరిపి ప్రాణాలతో పట్టుబడిన పాకిస్థాన్ ఉగ్రవాది మహమ్మద్ నవెద్ యాకూబ్ ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నిందితుడిని 14 రోజులు కస్టడిలోకి తీసుకున్నారు.

జమ్మూ కాశ్మీర్ లో సోమవారం రాత్రి నవీద్ ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ముందు అతనిని హాజరుపరిచారు. నవెద్ ను విచారణ చెయ్యడానికి కస్టడికి ఇవ్వాలని ఎన్ఐఏ అధికారులు కోర్టులో మనవి చేశారు.

ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల పాటు నవెద్ ను విచారణ చెయ్యడానికి అనుమతి ఇచ్చింది. నవెద్ కు 12 మంది ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయని ఇప్పటికే అధికారులు గుర్తించారు. నవెద్ ను కోర్టు నుండి బయటకు తీసుకు వెళ్లారు.

అంతకు ముందు నవెద్ మీడియాను చూస్తు చిరునవ్వులు చిందించాడు. అతను నేరం చేసినట్లు ముఖంలో ఎలాంటి విచారం కనిపించడం లేదు. హాయిగా ఉంటున్నాడు. మీడియాను చూస్తు ఇక చెప్పడాకికి ఏమి లేదని అంతా చెప్పేశానని అన్నాడు.

 Udhampur attack case will spend 14 days in the custody of the NIA

గత వారం జమ్మూ కాశ్మీర్ లోని ఉదమ్ పూర్ లో ఏకే-47 ఆయుధాలతో బీఎస్ఎఫ్ జవాన్ల మీద ఇద్దరు ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఆ సందర్బంలో బీఎస్ఎఫ్ జవాన్ల ఎదురు కాల్పులలో ఒక ఉగ్రవాది మరణించాడు. ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు వీరమరణం పోందారు.

ఆ సందర్బంలో బీఎస్ఎఫ్ జవాన్లు మహమ్మద్ నవెద్ ను ప్రాణాలతో పట్టుకున్నారు. నవెద్ తన వయస్సు 20 సంవత్సరాలు అని మొదట చెప్పాడు. తరువాత తనకు 16 సంవత్సరాలు అని పదే పదే మాటలు మార్చి బాలనేరస్తుడు అనే సాకుతో తప్పించుకోవాలని చూశాడు.

తనకు పాక్ అక్రమిత కాశ్మీర్ లో లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు శిక్షణ ఇచ్చారని అంగీకరించాడు. తను రంజాన్ నెల ప్రారంభం అయిన సందర్బంలోనే కాశ్మీర్ లో చోరబడ్డానని నవెద్ అంగీకరించాడు.

నవెద్ నుండి పూర్తి వివరాలు బయటకు రాబట్టడానికి ఎన్ఐఏ అధికారులు అతనిని కస్టడిలోకి తీసుకున్నారు. నవెద్ పుట్టుపూర్వోత్తరాలు బయటకు లాగి కోర్టు ముందు అతనిని దోషిగా నిలబెట్టాలని ఎన్ఐఏ అధికారులు నిర్ణయించారు.

ఇప్పటికే నావెద్ ను జమ్మూ కాశ్మీర్ పోలీసు అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు. పూర్తి సమాచారం సేకరించడానికి ఎన్ఐఏ అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న సందర్బంలో ఉగ్రవాదులు ఇంకా ఏమైనా దాడులు చెయ్యాడానికి ప్లాన్ వేశారా అని ఆరా తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+