ఐటీ సర్వేపై బీబీసీకి అండగా బ్రిటన్ సర్కార్-పార్లమెంట్లో ఎంపీల ప్రశ్నలకు కీలక జవాబు..
భారత్ లో ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ నేపథ్యంలో ఢిల్లీ, ముంబైలోని ఆ సంస్ధ కార్యాలయాలపై ఐటీ అధికారులు సర్వే నిర్వహించారు. ఇందులో పలు అక్రమాలు గుర్తించినట్లు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐటీ సర్వేను నిశితంగా గమనించిన బ్రిటన్ ప్రభుత్వం.. ఇవాళ దీనిపై పార్లమెంటులో ఎంపీల ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.
గత వారం న్యూఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాలపై ఆదాయపు పన్ను అధికారుల దాడులపై సమాధానం చెప్పాలని హౌస్ ఆఫ్ కామన్స్‌లో బ్రిటన్ ప్రభుత్వాన్ని ఎంపీలు ప్రశ్నించారు. దీంతో పార్లమెంటరీ అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా డేవిడ్ రూట్లీ.. భారతదేశంలో దాడి, భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రతిపక్ష పార్టీల ఎంపీల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తాము ఈ విషయంలో బీబీసీకి అండగా నిలుస్తామన్నారు. బీబీసీకి ఇప్పటికే నిధులు ఇస్తున్నామని, బీబీసీ వరల్డ్ సర్వీస్ చాలా ముఖ్యమైందిగా భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బీబీసీ స్వేచ్ఛ కీలకమని తాము విశ్వసిస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.

కానీ ఎంపీలు మాత్రం భారత్ లో కేంద్రం చర్యల్ని తప్పుబట్టారు. ఐటీ సర్వేను ఉద్దేశపూర్వక బెదిరింపు చర్యగా అభివర్ణించారు. భారత్ లో తమ నాయకుడిపై డాక్యుమెంటరీ విడుదల తర్వాత బీబీసీపై జరుగుతున్న దాడుల్ని వారు తప్పుబట్టారు. కన్జర్వేటివ్ ఎంపీ జూలియన్ లూయిస్ ఈ దాడిని "అత్యంత ఆందోళనకరంగా" అభివర్ణించారు.
లేబర్ పార్టీ ఎంపీ ఫాబియన్ హామిల్టన్ ..భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా తన స్థానం గురించి గర్వపడుతోందని, అయితే దాడుల కారణంతో సంబంధం లేకుండా ఇది ఆందోళన కలిగించే అంశమన్నారు.












Click it and Unblock the Notifications