Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడితో భారత్ అలర్ట్ ? ఇప్పటికే ప్రిపరేషన్ ..!

రష్యాపై ఉక్రెయిన్ తాజాగా జరిపిన డ్రోన్ల దాడి ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసింది. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలు మాత్రమే వాడుతున్న పరిజ్ఞానం సాయంతో రష్యా ఎయిర్ బేస్ లపై కచ్చితమైన దాడులు చేసిన ఉక్రెయిన్ వ్యూహంపై ప్రశంసలు వెల్లువెత్తాయి. అదే సమయంలో ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇలాంటి డ్రోన్లను అందిపుచ్చుకునేందుకు, వాటి ద్వారా ప్రత్యర్ధిపై విరుచుకుపడేందుకు ప్రయత్నిస్తున్న భారత్ ను ఉక్రెయిన్ దాడి అలర్ట్ చేసింది.

రష్యాపై దాడులకు ఉక్రెయిన్ వాడింది ఎఫ్పీవీ (ఫస్ట్ పర్సన్ వ్యూ) డ్రోన్లు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్తాన్ మన దేశంపై పంపిన టర్కీ డ్రోన్లు యూఏవీలు(అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్). ప్రస్తుతానికి ఈ రెండు రకాల డ్రోన్లూ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నో యుద్ధాలు, పోరాటాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. గాజాపై దాడులకు ఇజ్రాయెల్ వాడుతున్నవి కూడా ఇవే. శత్రువుల రాడార్లకు అందకుండా ఆప్టికల్ ఫైబర్ల సాయంతో ఇవి 18-20 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలపై కచ్చితంగా దాడులు చేయగలవు. అందుకే రష్యా రాడార్లకు అందకుండా ఉక్రెయిన్ డ్రోన్లు భారీ నష్టానికి కారణమయ్యాయి.

Ukraine s terrific drone attack on Russia alerts under preparing india

ఈ దాడుల్ని భారత్ కూడా నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ కు ముందే 100 ఎఫ్వీపీలకు ఆర్డర్ పెట్టింది. ఇందులో తొలి విడతగా ఐదు డ్రోన్లు వచ్చేశాయి కూడా. ఇలాంటి తరుణంలో ఉక్రెయిన్ రష్యాపై ఇలాంటి డ్రోన్లతోనే జరిపిన దాడి భారత్ తో పాటు ప్రపంచ దేశాలకు కనువిప్పు కావాలని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్ దాడుల కంటే ముందే భారత్ ఎఫ్వీవీల కోసం ఆర్డర్లు పెట్టడంతో భవిష్యత్తులో ఇలాంటి దాడులకు ముందే ప్రిపేర్ అవుతున్నట్లు నిపుణులు చెప్తున్నారు.

భవిష్యత్తులో జరిగే అన్ని యుద్ధాల్లోనూ మిస్సైళ్లను మించి డ్రోన్లే కీలక పాత్ర పోషిస్తాయని, ముఖ్యంగా శత్రువుల రాడార్లకు చిక్కకుండా వెళ్లి తమ పని చక్కబెట్టే సామర్ధ్యం వీటికి ఉందని చెప్తున్నారు. తాజాగా ఉక్రెయిన్ కూడా కంటెయినర్లపై వీటిని పెట్టి రష్యాలోకి పంపింది. ఒకసారి అవి లక్ష్యాలకు సమీపంగా వచ్చాక ఏకకాలంలో దాడులు చేసి ఎయిర్ బేస్ లను, యుద్ద విమానాలను ధ్వంసం చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+