ఎయిర్‌పోర్టులో ఉక్రెయిన్ వ్యాపారవేత్త ఆత్మహత్య
ముంబై: నగరంలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉక్రెయిన్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఎయిర్‌పోర్టులోని రెండో టెర్మినల్ నుంచి దూకి మృతిచెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉక్రెయిన్‌కు చెందిన మిఖైలో చెక్రిగిన్(32) అనే వ్యక్తి వ్యాపార పనుల నిమిత్తం ముంబై వచ్చాడు. ఆదివారం రాత్రి చెక్రిగిన్ టెర్మినల్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.

గమనించిన అధికారులు అతన్ని వెంటనే కూపర్ ఆస్పత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ చెక్రిగిన్ మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications