వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఊహించలేదు: ఉమాభారతి, రాహుల్ ఇలాకాలో కాంగ్రెస్ ‘0’

ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి 300కు పైగా సీట్లు వస్తాయంటే తాను నమ్మలేదని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఉమాభారతి చెప్పారు. కానీ, ఆరు నెలల క్రితం ప్రచారం ప్రారంభించినప్పుడు మాత్రం నమ్మడం ప్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి 300కు పైగా సీట్లు వస్తాయంటే తాను మొదట నమ్మలేదని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఉమాభారతి చెప్పారు. కానీ, ఆరు నెలల క్రితం ప్రచారం ప్రారంభించినప్పుడు మాత్రం నమ్మడం ప్రారంభించానని తెలిపారు. ఈసారి 300 సీట్లకు పైగా వస్తాయని భావించానని తెలిపారు.

2024వరకూ ఆశలొద్దు: మోడీపై ఒమర్‌ అబ్దుల్లా సంచలనం, తొలి గెలుపు బీజేపీదే2024వరకూ ఆశలొద్దు: మోడీపై ఒమర్‌ అబ్దుల్లా సంచలనం, తొలి గెలుపు బీజేపీదే

జాతులపరంగా ఏకమవ్వడంతో గానీ, కులాలు కలవడంతోగానీ ఇది సాధ్యంకాదన్నారు. రాహుల్‌- అఖిలేష్‌లు ఇలా చేయలేరన్నారు. అయోధ్య రామాలయం అంశాన్ని ఆయుధంగా చేసుకోలేదని చెప్పారు. దీనికి మోడీ అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొంటారని ఉమాభారతి పేర్కొన్నారు.

రాహుల్ ఇలాకాలో ఖాతా తెరవని కాంగ్రెస్

uma bharti on BJP winning in UP assembly elections

ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీ మెజార్టీ సీట్లతో దూసుకుపోతోంది. ఆ పార్టీ 300కి పైగా స్థానాల్లో విజయం ఖాయంగా కనిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీని ఎలాగైనా దెబ్బతీసి అధికారం చేపట్టాలని ఆశించిన ఎస్పీ-కాంగ్రెస్‌ కూటమికి భారీ ఎదురుదెబ్బ తగిలింది.

బీజేపీకి ఆ కూటమి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. 12 స్థానాల్లో గెలుపొంది.. మరో 43స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ వ్యక్తిగతంగానూ ఘోరంగా దెబ్బతింది. ఈ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ విస్తృత ప్రచారం నిర్వహించినా తన పార్లమెంటు నియోజకవర్గమైన అమేథీ జిల్లాలో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలుపించుకోలేకపోవడం గమనార్హం.

English summary
Union Minister Uma Bharti responded on BJP winning in Uttar Pradesh assembly elections results 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X