దారి తప్పి మాయమైన ఉమా భారతి చాపర్: సురక్షితం

రాంచీ: కేంద్ర మంత్రి ఉమా భారతి ప్రయాణిస్తున్న చాపర్ దారి తప్పింది. చాపర్‌లో ఉమాభారతి శనివారం జార్ఖండ్ రాష్ట్రంలోని రామగడ్‌కు బయలుదేరారు. ఆయితే, ఆమె ప్రయాణిస్తున్న చాపర్ మధ్యలో దారి తప్పడంతో తీవ్ర భయాందోళనలు చోటు చేసుకున్నాయి.

రామగఢ్ జిల్లాలోని రాజరప్ప దేవాలయానికి ఆమె శనివారం ఉదయం బయలదేరారు. కొద్ది సేపటి తర్వాత మధ్యలో చాపర్ పైలట్‌తో గ్రౌండ్ డ్యూటీలో ఉన్న సిబ్బందితో సంబంధాలు తెగిపోయాయి. అదే సమయంలో చాపర్ దారి తప్పింది.

Uma Bharti's chopper loses contact on its way to Ramgarh

దాదాపు 15 నిమిషాల తర్వాత ఆమె చాపర్ కాంటాక్ట్ దొరికింది. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సురక్షితంగా చాపర్ నేల మీద దిగింది. గతంలో కూడా ఉమా భారతికి ఇటువంటి అనుభవం ఎదురైంది. ఏప్రిలో మాసంలో ఝాన్సీలో దిగాల్సిన ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురిలో దిగింది.

పొరపాటు కారణంగా ఉమా భారతి హెలికాప్టర్ ఇక్కడ దిగిందని అప్పట్లో ప్రధాన ఎన్నికల అధికారి జైదీప్ గోవింద్ చెప్పారు. రాజరప్ప ఆలయం రామగఢ్‌కు 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడు భైరవి, దామదర నదలు సంగమిస్తాయి. దాన్ని చిన్నమాష్టిక ఆలయం అని కూడా పిలుస్తారు. దీని ప్రస్తాన వేదాల్లోనూ పురాణాల్లోనూ కనిపిస్తుంది. ప్రాచీన దేవాలయాల్లో ఇది కూడా ఒక్కటి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+