• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ISIS Target: కర్ణాటక, కేరళలో ఐసిస్ మకాం, పక్కా స్కెచ్, ఒసామా గ్యాంగ్ ప్రతీకారం, UN వార్నింగ్!

|

బెంగళూరు/ కొచ్చి/ న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి తాండవం చేస్తున్న సమయంలో మరో బాంబులాంటి వార్త వచ్చింది. ఐటీ, బీటీ సంస్థలకు ప్రపంచ ప్రసిద్ది చెందిన కర్ణాటకతో పాటు కేరళలో భారీ సంఖ్యలో ఐసిస్ ఉగ్రవాదులు మకాం వేశారని, ప్రతీకారాం తీసుకోవడానికి ప్లాన్ వేస్తున్నారని ఐరాస నివేదిక హెచ్చరించింది.

భారత్, పాకిస్థాన్, మయన్మార్, బాంగ్లాదేశ్ లో సుమారు 150 నుంచి 200 మంది ఉగ్రవాదులు తలదాచుకున్నారని ప్రభుత్వాలకు ఐరాస హెచ్చరించింది. ఒసామా గ్యాంగ్ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్లాన్ వేస్తోందని వెలుగు చూసింది. కర్ణాటకలో, కేరళ రాష్ట్రాల్లో ఐసిస్ అనుబంధ సంస్థ హింద్ విలాయాహ్ మఠాలో 180 నుంచి 200 మంది సభ్యులు ఉన్నారని ఐరాస హెచ్చరించింది.

Mafia Don: దేశాన్ని గడగడలాడించి కుక్కచావు, ఫ్రెండ్ భార్యపై మోజు, స్వర్గం చూపించింది, పక్కాప్లాన్ తో

 ఒసామా మహమ్మద్

ఒసామా మహమ్మద్

ఆల్ ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ (AQIS) నాయకుడు ఆసిమ్ ఉమర్ భద్రతా దళాల చేతిలో హతమైన తరువాత అతని స్థానంలో ఒసామా మహమ్మద్ బాధ్యతలు చేపట్టాడు. ఆసిమ్ ఉమర్ కాల్చివేతకు ప్రతీకారం తీర్చుకోవాలని, పలు ప్రాంతాల్లో దాడులు చెయ్యాలని ఐసిస్ కుట్ర పన్నుతోందని ఐరాస నివేదిక హెచ్చరించింది.

ఐసిస్ కనుసన్నల్లో AQIS

ఐసిస్ కనుసన్నల్లో AQIS

ఐసిస్, తానిబన్ కనుసన్నల్లో ఏక్యూఐఎస్ పని చేస్తుంది. ఐసిస్, తాలిబన్ ఆదేశాలతో ఏక్యూఐఎస్ కార్యకలపాలు సాగిస్తోంది. ఆఫ్గానిస్తాన్ లోని నిమ్రూజ్, కాందహార్ ప్రావిన్స్, హెల్మండ్ ప్రాంతాల నుంచి ఈ ముఠా సభ్యులు పని చేస్తున్నారు. ఆసిమ్ ఉమర్ కాల్చివేతకు తగిన ప్రతీకారం తీర్చుకోవాలని ఐసిస్, తానిబన్ ముఠా నాయకులు పగతో రగిలిపోతున్నారని ఐరాస హెచ్చరించింది.

టార్గెట్ కర్ణాటక, కేరళ

టార్గెట్ కర్ణాటక, కేరళ

భారత్ లో కొత్తగా ఒక ప్రావిన్స్ ను ఏర్పాటు చేసుకున్నామని గత ఏడాది మే నెలలోనే ఐసిస్ పేర్కొంది. అప్పటి నుంచి తన ముఠా సభ్యులను ఐసిస్ గుట్టుచప్పుడు కాకుండా నియమించుకుంటుందని ఐరాస నివేదిక వెల్లడించింది. ఐసిస్ కు భారత అనుబంధ ముఠా అయిన హింద్ విలాయాహ్ సభ్యులు పని చేస్తున్నారు. దాదాపు 180 నుంచి 200 మంది హింద్ విలాయాహ్ లో పని చేస్తున్నారని ఐరాస నివేదిక హెచ్చరించింది.

ఆఫ్గాన్ లో 6 వేల మంది పాక్ ఉగ్రవాదులు

ఆఫ్గాన్ లో 6 వేల మంది పాక్ ఉగ్రవాదులు

ఆఫ్గానిస్థాన్ లో దాదాపుగా 6, 500 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులు పాగా వేశారని ఐరాస నివేదిక హెచ్చరించింది. వీరిలో ఎక్కువ మంది తెహ్రిక్ ఏ తాలిబన్ పాకిస్థాన్ (TTP) ముఠా సభ్యులు ఉన్నారని, వీరి వలన పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్ కు ముప్పు చాలా ఎక్కువగా ఉందని ఐరాస నివేదిక హెచ్చరించింది. ఇప్పటికే టీటీపీ ముఠా పాకిస్థాన్ లో చెలరేగిపోయి విద్రోహ చర్యలకు పాల్పడిన విషయం తెలిసిందే.

  India Extends Medical Support Of $1 mn To North Korea | కష్టకాలంలో ఉత్తరకొరియాకు ఆపన్నహస్తం !!
   ఆలైఖైదా లీడర్ అక్కడే!

  ఆలైఖైదా లీడర్ అక్కడే!

  పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్రోహ చర్యల కోసం ఐసిస్- ఖోరాసన్ ఏర్పడింది. ఆఫ్గానిస్థాన్ లో అనేక ముఠాలు తాలిబన్ అనుబంధంగా ఉన్నాయి. మరికోన్ని సంస్థలు ఐసిస్- కెకు విధేయంగా పని చేస్తూ వారి ఆదేశాల మేరకు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఐరాస నివేదిక హెచ్చరించింది. ఆఫ్గానిస్థాన్ లోని 12 ఫ్రావిన్స్ లో ఆల్ ఖైదా పని చేస్తోంది. ఆల్ ఖైదా నాయకుడు అయమన్ ఆల్ జవహరి కూడా ఆఫ్గానిస్థాన్ లోని ఫ్రావిన్స్ పాంతంలోనే తలదాచుకున్నాడని ఐరాస నివేదిక హెచ్చరించింది. ముఖ్యంగా కర్ణాటక, కేరళలో ఉగ్రవాదుల విషయంలో అక్కడి ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలని ఐరాస నివేదిక హెచ్చరించింది.

  English summary
  A report by the United Nations on terrorism has warned that there are significant numbers of Islamic State terrorists in Kerala and Karnataka. It also noted that the al-Qaida in the Indian Subcontinent terror group, which reportedly has between 150 and 200 militants from India, Pakistan, Bangladesh and Myanmar, is planning attacks in the region.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more