ఉత్తర బెంగళూర్ లోక్ సభ స్థానానికి మేము పోటి చేయలేం , జేడి ఎస్
పార్టీల అలయోన్స్ లో మాకు ఇంకా సీట్లు కావాలని కోట్లాడిన పార్టీలను చూశాం, కాని కర్ణాటక లో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్దంగా ఉంది.పంచుకున్న సీట్లలో సైతం, మేము పోటి చేయలేమని చెతులెత్తేసింది దేవేగౌడ నేతృత్వంలోని జేడిఎస్
కార్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ,జేడిఎస్ ల పోత్తు విచిత్ర పరిస్థితిని ఎదుర్కోంటుంది.ప్రకటించిన స్థానాలకు సభ్యులు లేక జేడిఎస్ కాంగ్రెస్ కు తన సీట్లు తిరిగి ఇచ్చి వేస్తుంది. కాగా జేడిఎస్ కు కేటాయించిన ఎనిమిది స్థానాల్లో 5 స్థానాల్లో తమకు సరైన అభ్యర్థులు లేక కొట్టుమిట్టాడుతోంది.
ఈ నేపథ్యంలోనే ఉత్తర బెంగళూర్ లోక్ సభ స్థానానికి తాము పోటి చేయలేమంటూ జేడిఎస్ చెతులెత్తేసింది. తమకు కేటాయించిన స్థానాన్ని తిరిగి కాంగ్రెస్ కు వదిలిపెట్టింది.

కార్ణాటకలోని మొత్తం 28 స్థానాలకు గాను జేడిఎస్ 12 స్థానాలను డిమాండ్ చేసింది. అయితే రెండు పార్టీల మధ్య జరిగిన చర్చల అనంతరం కాంగ్రెస్ పార్టీ జేడిఎస్ 8 సీట్లను కేటాయించింది .కాగా కేటాయించిన ఎనిమిది సీట్లలో జేడిఎస్ కు సరైన అభ్యర్థులు లేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఉత్తర బెంగళూర్ లోక్ సభ స్థానం నుండి తాము పోటి చేయలేమంటూ కాంగ్రెస్ పార్టీకి తెలిపింది. దీనికి సంబంధించి ఎఐసిసి జనరల్ సెక్రటరీ కర్ణాటకా ఇంచార్జ్ కేసి వేణుగోపాల్ దేవేగౌడ కు కృతజ్ఝతలు తెలిపారు .












Click it and Unblock the Notifications