14 ఏళ్లు జైల్లో ఉన్నా బుద్ధి రాలేదు.. మళ్లీ అదే నేరం!
తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో 14 ఏళ్ల శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదలైన ఖైదీ మళ్లీ ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన దారుణ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో జరిగింది.
అహ్మద్ నగర్ : తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో 14 ఏళ్ల శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదలైన ఖైదీ మళ్లీ ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన దారుణ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో జరిగింది.
అహ్మద్‌నగర్ జిల్లా కార్జత్ తహసీల్ పరిధిలోని జలాల్‌పూర్ ప్రాంతానికి చెందిన లాహుదేవరాం పవార్ తన బంధువు కుమార్తె(5)కు చాక్లెట్ కొనిస్తానని ఉక్కడ్ గామ్ గ్రామానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు.

రక్తస్రావమవుతున్న బాలికను ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితుడైన లాహుదేవరాం పవార్ ను పింపాల గ్రామంలో పట్టుకున్నారు. నిందితుడు లాహుదేవరాం గతంలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడని పోలీసులు చెప్పారు.
రేప్ కేసులో కఠిన కారాగారశిక్ష వేసినా.. జైలు నుంచి విడుదల అయ్యాక మళ్లీ మరో చిన్నారిపై అఘాయిత్యం చేయడం సంచలనం రేపింది. జైలు జీవితం గడిపినా ఖైదీలో మార్పు రాకపోగా వచ్చిన వెంటనే మరో చిన్నారిపై అత్యాచారం చేయడంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications