Delhi: ఢిల్లీలో 88 ఏళ్ల రికార్డు వర్షం- జలదిగ్బంధం, కరెంటు కోత, విమానాల రద్దుతో ఎమర్జెన్సీ..!
దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ నమోదైన రికార్డు వర్షపాతం అప్రకటిత ఎమర్జెన్సీకి కారణమవుతోంది. తెల్లవారు జామున కురిసిన 228 మి.మీ వర్షంతో ఢిల్లీ జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఈదురుగాలులకు ఢిల్లీ ఎయిర్ పోర్టు పైకప్పు కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. భారీ వర్షం కారణంగా నగరంలో పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకోగా.. విద్యుత్ కోతలు, ఆహారం అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇందులో మంత్రి అతిషి ఇల్లు కూడా ఉంది. నిన్న కూడా రాజధానిలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షపాతం నమోదైంది. తీవ్రమైన వేడిమి నుంచి ఇది కాస్త ఉపశమనం కలిగించిందని అనుకుంటుండగానే అది కాస్తా మరింత తీవ్రమైంది. చూస్తుండగానే ఏకంగా 228 మి.మీ వర్షపాతం నమోదు కావడంతో నగర వ్యాప్తంగా భారీ ట్రాఫిక్ జామ్ లు తలెత్తాయి. తాజాగా మరిన్ని వర్షాలు తప్పవంటూ ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఢిల్లీ ఎయిర్ పోర్టులో టెర్మినల్ కుప్పకూలిన ఘటన తర్వాత దాదాపుగా విమానాశ్రయాన్ని మూసేశారు. రాకపోకలను రద్దు చేశారు. మధ్యాహ్నం తర్వాత బయటి నుంచి వచ్చే విమానాలను అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలో భారీ వర్షం తర్వాత 200 హాట్ స్పాట్ లను గుర్తించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో 40 హాట్ స్పాట్ లు ప్రజా పనులశాఖ సీసీటీవీ పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది. భారీ వర్షం కురవడంతో నీటి మట్టం తగ్గేందుకు సమయం పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. జల దిగ్బంధనం సమస్యలపై ఫిర్యాదుల కోసం ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసింది.
Sriniwas Puri..
— Atulkrishan (@iAtulKrishan1) June 28, 2024
Delhi drowns after heavy rain fall
Massive waterlogging everywhere pic.twitter.com/O30FVOBQpD












Click it and Unblock the Notifications