షాకింగ్ వీడియో: ఒక్కసారిగా గంగా నదిలో కుప్పకూలిపోయిన కేబుల్ బ్రిడ్జి
పాట్నా: బీహార్ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఓ తీగల వంతెన(కేబుల్ బ్రిడ్జి) ఒక్కసారిగా నదిలో కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. ఖగారియా జిల్లాలో గంగా నదిపై అగువాని సుల్తాన్‌గంజ్ గంగా పేరుతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి ఒక్కసారిగా నదిలో కూలిపోయింది. ఈ వంతెనకు ఇలా కూలిపోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
#WATCH | Under construction Aguwani-Sultanganj bridge in Bihar’s Bhagalpur collapses. The moment when bridge collapsed was caught on video by locals. This is the second time the bridge has collapsed. Further details awaited.
— ANI (@ANI) June 4, 2023
(Source: Video shot by locals) pic.twitter.com/a44D2RVQQO
ఏప్రిల్ నెలలో తుఫాను కారణంగా బ్రిడ్జి పిల్లర్లు కొంత భాగం దెబ్బతిన్నాయి. ఖగారియా-అగువాని ప్రాంతాల మధ్య గంగా నదిపై ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం కోసం బీహార్ ప్రభుత్వం రూ. 1,717 కోట్లు కేటాయించింది. రెండోసారి కూడా వంతెన కూలిపోవడంతో బీహార్ సీఎం నితీష్ కుమార్ విచారణకు ఆదేశించారు.

2015లో నితీష్ కుమార్ ఈ వెంతన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2020 నాటికి ఈ వంతెన నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా.. ఇప్పటికీ పూర్తికాలేదు. అంతేగాక, ఇప్పుడు దాదాపు ఈ వంతెన మొత్తం నదిలో కూలిపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా, బ్రిడ్జి కూలుతున్న సమయంలో అక్కడేవున్న స్థానికులు ఆ దృశ్యాలను ఫోన్లలో వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడయాలో వైరల్‌గా మారాయి.
#WATCH | Under construction Aguwani-Sultanganj bridge in Bihar’s Bhagalpur collapses. The moment when bridge collapsed was caught on video by locals. This is the second time the bridge has collapsed. Further details awaited.
— ANI (@ANI) June 4, 2023
(Source: Video shot by locals) pic.twitter.com/hMuoLmtXiD
మరోవైపు, నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి ఇలా రెండుసార్లు కూలిపోవడంపై రాష్ట్ర ప్రతిపక్షాలు నితీశ్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. 'సీఎం కమీషన్లకు అలవాటుపడ్డారు. ప్రభుత్వ వ్యవస్థ మొత్తం అవినీతిలో కూరుకుపోయింది. రాష్ట్రంలో పాలనను గాలికొదిలేసి ప్రతిపక్షాల ఐక్యత కోసం నితీష్ దేశంలో తిరుగుతున్నారు' అని బీజేపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ సిన్హా విమర్శించారు.

కాగా, గత డిసెంబర్ నెలలో కూడా బీహార్‌లోని బెగుసరాయ్ ప్రాంతంలో బుర్హి గండక్ నదిపై నిర్మించిన బ్రిడ్జి కూడా కొంతభాగం కూలిపోవడం గమనార్హం. ఈ ఘటనలో ఓ కూలి చనిపోగా, మరో వ్యక్తి తీవ్రగాయాలయ్యాయి.
ఇది ఇలావుండగా, కిషన్ గంజ్, సహర్సా జిల్లాలో కూడా రెండు వంతెనలు ప్రారంభానికి ముందే కూలిపోవడం గమనార్హం.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications