Women's: జులై 1 నుంచి ప్రతి మహిళకు నెలకు రూ.1500..!
జులై 1 నుంచి ప్రతి మహిళఖు నెలకు రూ.1500 రానున్నాయి. అయితే ఇది ఏపీలోనో, తెలంగాణలోనో కాదు.. మహారాష్ట్రలో. అవును లడ్కీ బెహనా యెజన పథకం కింద ప్రతి నెలా అర్హులైన మహిళలకు రూ. 1500 ఆర్థిక సాయం చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్ర ఆర్థిక మంత్రి అజిత్ పవార్ శనివారం ఆ రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో లడ్కీ బెహనా యెజన పథకం తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఈ బడ్జెట్ లో బాలికలకు ఉచిత విద్య, నిరుద్యోగులకు పథకాలు ,లడ్కీ బెహనా యోజన పథకాలకు నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
లడ్కీ బెహనా యెజన పథకం జూలై 1, 2024 నుంచి అమలులోకి రానుంది. ఈ పథకాని 21 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద మహిళలకు ప్రభుత్వం నెలకు రూ.1500 ఇవ్వనుంది. ఈ పథకం కింద రూ.1500 రావాలంటే.. మహిళలు 21-60 ఏళ్ల మధ్య ఉండాలి. సంవత్సరాదాయం రూ. 2.50 లక్షల కంటే తక్కువగా ఉండాలని మంత్రి తెలిపారు. మహారాష్ట్రకు చెందిన మహిళలకే ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు.

ఈ పథకం కింది వివాహితులు, వితంతువులు, విడాకులు తీసుకున్నవారు.. భర్తతో విడిగా ఉంటున్న వారు, నిరాశ్రయులైన మహిళలు రూ.1500 పొందవచ్చు. అర్హతలు ఉన్నవారు.. బ్యాంక్ ఖాతాను కిలిగి ఉండాలి. అప్పుడు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మహారాష్ట్రలో లడ్కీ బెహనా యెజన పథకం 3.50 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందనున్నట్లు అజిత్ పవార్ తెలిపారు. ఈ పథకం కోసం ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. లబ్ధిదారులకు ఆధార్ కార్డు, మహారాష్ట్ర నివాస ధృవీకరణ పత్రం, లేదా బర్త్ సర్టిఫికెట్, రక్షమ్ అథారిటీ జారీ చేసిన ఇన్ కం సర్టిఫికెట్, బ్యాంకు ఖాతా పాస్ బుక్ జీరాక్స్ కాపీలు, పాస్ పోర్టు సైజ్ ఫోటో, రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.
అప్లికేషన్ ప్రాసెస్ స్కీమ్ దరఖాస్తులను పోర్టల్/మొబైల్ యాప్/సేతు సువిధ కేంద్రం ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. తెలంగాణలో కూడా మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని ఎన్నికలకు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. త్వరలోనే మహిళలకు రూ.2500 అందజేయనున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో సెప్టెంబర్ 2023లో మహిళలకు నెలకు రూ.1000 అందిస్తోంది. లబ్దిదారులకు కుటుంబ వార్షికాదాయం రూ. 2.5 లక్షలలోపు ఉండాలి, 5 ఎకరాల కంటే తక్కువ సాగునీటి భూమి లేదా 10 ఎకరాల నాన్-ఇరిగేషన్ భూమి యాజమాన్యం, వార్షిక విద్యుత్ వినియోగం 3,600 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో 19-59 ఏళ్లలోపు అర్హులైన మహిళలందరికీ నెలకు రూ.1,500 ఇస్తామని హామీ ఇచ్చింది. కర్ణాటకలోని సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.2,000 ఇస్తామని హామీ ఇచ్చింది. మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా మరియు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో మహిళలకు నెలవారీ రూ. 1,000 స్టైఫండ్‌ను అందించారు.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మమతా బెనర్జీ మహిళల కోసం పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా జనరల్ కేటగిరీలోని మహిళలకు రూ.500, షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు) మరియు షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు)కి చెందిన వారికి రూ.1,000 నెలవారీ సహాయం అందజేస్తున్నారు. ఈ రాష్ట్రాలతో పాటు, ఢిల్లీలో, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం మార్చిలో ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనను 2024-25 బడ్జెట్‌లో ఆవిష్కరించింది. పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ పెన్షన్ పథకాలు పొందేవారు, ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయించి, 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి మహిళకు నెలవారీ రూ. 1,000 ఇస్తోంది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications