కుర్రాడితో రాసలీలలు: భర్తను చంపిన భార్య, అరెస్టు

న్యూఢిల్లీ: ఓ మహిళ 17 ఏళ్ల వయస్సు గల కుర్రాడితో కామక్రీడకు మరిగి తన భర్తను హత్య చేసింది. భర్తతో లైంగిక సంబంధంపై అసంతృప్తితో ఉన్న ఆ మహిళ తన ప్రేమికుడైన కుర్రాడితో కలిసి భర్తను చంపింది. ఈ సంఘటన నెల రోజుల తర్వాత బయటపడింది. పక్క ఫ్లాట్‌లో ఉంటున్న కుర్రాడితో పరిచయం క్రమంగా లైంగిక సంబంధానికి దారి తీసింది. దీంతో సుధా గుప్తా అనే ఆ 28 ఏళ్ల మహిళ తన 40 ఏళ్ల భర్త రమేష్ చంద్రను చంపింది.

రమేష్ చంద్ర ఢిల్లీ సుబ్రతో పార్క్‌లో భారత వైమానిక దళంలో సార్జెంట్‌గా పనిచేస్తున్నారు. అయితే, ఆయనకు తన భార్యకు కుర్రాడితో లైంగిక సంబంధం ఉన్న విషయం తెలియదు. ఎప్పటి లాగే ఇంటికి గత నెల 10వ తేదీన కూడా వచ్చాడు. కానీ, భార్య అతన్ని అడ్డు తొలగించుకునేందుకు పథకం వేసింది. అతని హత్యకు కుట్ర పన్నింది.

Murder

భర్త ఇంటికి రాగానే ముందస్తు ప్రణాళిక ప్రకారం మహిళ, ఆమె ప్రేమికుడు కలిసి అతన్ని పట్టుకుని అతని గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అయితే, తన భర్త గుండెపోటుతో మరణించాడని సుధా చంద్ర నమ్మబలికింది. అయితే, మిలిటరీ నిబంధనల ప్రకారం రమేష్ చంద్ర మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టంలో నివ్వెరపోయే విషయం బయటపడింది.

గొంతు నులమడం వల్ల రమేష్ చంద్ర మరణించాడని పోస్టుమార్టంలో తేలడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, సుధ చంద్రను విఛారించారు. విచారణలో వాస్తవాన్ని ఆమె అంగీకరించింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. కుర్రాడిని బాలనేరస్తుల కేంద్రానికి తరలించారు. సుధ, రమేష్ చంద్రలకు నాలుగేళ్ల పాప ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+