Unicef Jobs : యునిసెఫ్ వాలంటీర్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తుల ఆహ్వానం
యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్(UNICEF) సంస్థ వాలంటీర్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల జీవితాలను మెరుగుపరిచేందుకు,ప్రజల భాగస్వామ్యంతో విస్తృతమైన గ్లోబల్ నెట్‌వర్క్‌ను ఏర్పరిచేందుకు యునిసెఫ్ ఈ కార్యక్రమం చేపడుతోంది.
ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూట్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్టులో యునిసెఫ్‌తో స్వచ్ఛందంగా పనిచేయడానికి లేదా భాగస్వామిగా ఉండటానికి వ్యక్తులు లేదా సంస్థలకు అవకాశం ఇవ్వడం ఈ కార్యక్రమం ఉద్దేశం.వేరే సంస్థల్లో ఫుల్ టైమ్ ఉద్యోగాలు చేసేవారు సైతం ఖాళీ సమయాల్లో యునిసెఫ్‌తో వాలంటీర్‌గా పనిచేసే అవకాశం కల్పించేలా ఈ కార్యక్రమం రూపొందించబడింది. దీని ద్వారా ఆసక్తి గల అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించబడుతాయి.

యునిసెఫ్ వాలంటీర్‌గా మీ ప్రాంతంలోని చిన్నారులపై ఫోకస్ చేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల జీవితాలను మెరుగుపరిచేందుకు యునిసెఫ్ సంస్థకు సహకరించేలా మీ బాధ్యతలు ఉంటాయి.ప్రాజెక్టుకు సంబంధించిన భారీ మొత్తాన్ని పంపిణీ చేయాల్సిన బాధ్యత వాలంటీర్ల పైనే ఉంటుంది. కాబట్టి వాలంటీర్లకు స్వీయ క్రమశిక్షణ,సమగ్రత అవసరం.
కమ్యూనిటీలకు చేరువయ్యేందుకు వాలంటీర్ల పైనే యునిసెఫ్ ఆధారపడుతుంది.స్థానిక కమ్యూనిటీల్లో ప్రాజెక్టు అమలు విషయంలో వాలంటీర్‌లదే కీలక పాత్ర. ఆసక్తి గల అభ్యర్థులు వాలంటీర్ ప్రోగ్రామ్ కోసం జూన్ 30,2021 లోగా దరఖాస్తు చేసుకోవాలి.












Click it and Unblock the Notifications